Balakrishna Radhika : పిలల్ల కోసం వెళ్లేందుకు, ఆడ, మోగా అందరు ఒకటే బాట

బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ రాధికా చెప్పిన మాటలు అందరిని కొంత షాక్ కి గురి చేయచ్చు.పిల్లల కోసం పెళ్లి అవసరం లేదు అనే భావం నేటి తరం యువతలో ఎక్కువగా కనిపిస్తుంది.

 Indian Marriages With Male And Female , Indian Marriages , Balakrishna , Unstopp-TeluguStop.com

ఇది ఇంతకు ముందు రోజుల్లో అయితే అస్సలు ఉండేది కాదు కానీ ఎప్పుడైతే యువత అందులో ముఖ్యంగా ఆడ పిల్లలు ఇండిపెండెంట్ గా ఉంటున్నారు.సెల్ఫ్ రెస్పెక్ట్ తో అస్సలు ఎవరికి బెండ్ అవ్వాలని అనుకోవడం లేదు.

ఫైనాన్సియల్ గా బాగా సెటిల్ అవుతున్న ఆధునిక తరం అమ్మాయిల్లో పెళ్లి అవసరం అనే భావన ఎక్కువ అయ్యింది.పిల్లల కోసం ఎన్నో ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయ్, ఐవిఎఫ్, ఐయుఐ లాంటి ఎన్నో ఉండగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఓపెన్ అవుతున్నారు.

ఇక సింగల్ మదర్ ట్యాగ్ వల్ల వచ్చే నష్టం ఏమి లేదని, నాటి రోజుల్లో అయితే ఎలా బ్రతకాలి, ఎలా పిల్లలను పెంచాలి అనే కష్టాలు ఉండేవి కానీ ఇప్పుడు మొగవాళ్ళతో సమానంగా ఆడవాళ్లు సైతం బాగా సంపాదిస్తున్నారు కాబట్టి పిల్లలను పెంచడం, పెళ్లి చేసుకోకుండా ఉండటం పెద్ద విషయాలుగా కనిపించడం లేదు.మరో వైపు పెళ్లి, పిల్లలలు అనే పెద్ద నిర్ణయాలు తీసుకోవాలంటే సరైన చదువు, ఉద్యోగం ఉండాలని అనుకుంటున్నారు.

ఇక సొసైటీ లో కూడా ఇలాంటి మార్పు బాగా వస్తుంది.పెళ్లి అంటే స్వేచ్ఛను బంధించడమే అని బాగా ఫిక్స్ అయ్యి బ్యాచులర్ లైఫ్ కి జిందాబాద్ చెప్తున్నారు.

Telugu Balakrishna, Female, Indianmarriages, Male, Marriages, Radhika, Mother, U

ఇక ఇది కేవలం ఆడవాళ్ళలో మాత్రమే కాదు మొగవాళ్లలో కూడా కనిపిస్తుంది.అసలే ఆడపిల్లలు తక్కువ గా ఉండి కొంత శాతం అబ్బాయిలు ఇప్పటికే పెళ్లి పెటాకులు లేకుండా ఒంటరిగానే ఉంటున్నారు.ఇక ముప్పయి ఏళ్ళు వచ్చిన పెళ్లి ఊసెత్తడం లేదు.పోనీ చేసుకున్న కూడా ఏం సుఖం లెండి 40, 45 వచ్చిందట జీవితంలో పెద్దగా సంసారం సుఖం ఉండటం లేదు.

కాబట్టి ఈమాత్రం దానికి పెళ్లి ఎందుకు అని అనుకుంటున్నారు.అండాన్ని డొనేట్ చేసేవారు,, సరోగేట్ మదర్స్ ఉంటున్నారు కాబట్టి పెళ్లి చేసుకోకుండా ఉండేవారు పెరుగుతున్నారు.ఇక చాల మంది సింగల్ ఫాదర్స్ ని మనం సొసైటీ లో చూస్తున్నాం కూడా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube