మన దేశంలో ఎన్నో ప్రధానమైన దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.అంతేకాకుండా మొత్తం మూడు కోట్ల మంది దేవుళ్లను ప్రజలు పూజిస్తున్నారు.
ఆయన దేవతలందరికీ రకరకాల నైవేద్యాలను భక్తులు సమర్పిస్తూ ఉంటారు.గణపతికి పత్రి, కృష్ణుడికి వెన్న శివుడికి బిల్వ పత్రం లాగా ప్రతి దేవునికి రకరకమైన నైవేద్యాలు సమర్పిస్తుంటారు.
తల్లిదండ్రులు పిల్లలను బుజ్జగించడానికి చాక్లెట్ ఇవ్వడం సర్వసాధారణమైన విషయమే.కానీ ఇక్కడ భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవునికి చాక్లెట్స్ నైవేద్యంగా సమర్పిస్తున్నారు.ఈ వింత ఆచారం కేరళ రాష్ట్రంలోని తెక్కన్ పలని బాలసుబ్రమణ్యం దేవాలయంలో భక్తులు చాక్లెట్లను నైవేద్యంగా సమర్పిస్తూ వస్తున్నారు.అవును గత ఆరు ఏళ్లగా ఈ ప్రదేశం మంచ్ మురుగన్ దేవాలయం గా ప్రసిద్ధి చెందింది.
బాల మురుగన్ మంచ్ మురుగన్ గా ఎలా మారాడో ఇప్పుడు తెలుసుకుందాం.ఆరు సంవత్సరాల క్రితం ఆడుకుంటున్న ఒక చిన్న ముస్లిం పిల్లాడు ఈ దేవాలయానికి వచ్చి గంట కొట్టాడు.దీంతో తల్లిదండ్రులు అతడిని మందలించారు.అదే రోజు రాత్రి బాలుడి ఆరోగ్యంలో మార్పు వచ్చింది.తల్లిదండ్రులు మరుసటి రోజు ఉదయం దేవాలయానికి వచ్చి రాత్రంతా బాలుడు మురుగన్ నామం జపిస్తున్నాడని పూజారికి చెప్పారు.పూజారి దేవుడికి ఏదైనా నైవేద్యంగా సమర్పించాలన్నప్పుడు ఆ తల్లిదండ్రులు నువ్వుల నూనె ఇవ్వడానికి అంగీకరించారు.
అక్కడే ఉన్న కుర్రాడు తన దగ్గర ఉన్న మంచ్ చాక్లెట్ ని దేవుడికి నైవేద్యంగా పెట్టాడు.ఇక ఆ తర్వాత అద్భుతం జరిగింది.
ఈ ఘటన తర్వాత ఆ పిల్లాడు కోలుకున్నాడు.దీంతో భక్తులు మంచ్ చాక్లెట్ ను అప్పటి నుంచి మురుగన్ కి నైవేద్యంగా సమర్పించడం మొదలుపెట్టారు.
అప్పటి నుంచి భక్తులు బాల మురుగన్ నీ మంచ్ మురుగన్ గా పిలవడం మొదలుపెట్టారు.
DEVOTIONAL