చాలా మంది కమెడియన్స్ వయసు పెరిగే కొద్దీ అవకాశాలు తగ్గుతుండడంతో తమదైన రీతిలో రాణించడానికి కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు.అందులో ముఖ్యంగా తమ నటనను మరో స్థాయిలో చూపించుకోవాలంటే భారమైన పాత్రలే అందుకు చక్కటి అవకాశం అని భావిస్తున్నారు.
అందుకే అలాంటి ఒక భారమైన పాత్ర లేదా నటనకు స్కోప్ ఉన్న పాత్ర రాగానే మరో మాట ఆలోచించకుండా ఒప్పుకుంటున్నారు.అలా లేటు వయసులో హృదయాలను అత్తుకునే పాత్రల్లో నటించిన ఆ కమీడియన్స్ ఎవరో ఓసారి చూద్దాం.
బ్రహ్మానందం( Brahmanandam )
కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ సినిమా ఈరోజు ఇంత మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది అంటే ఎందుకు కారణం పూర్తిగా బ్రహ్మానందం అని చెప్పక తప్పదు.తనలోని ఒక అద్భుతమైన నటుడిని ఈ చిత్రం ద్వారా వెలికి తీశారు చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం ని ఇలాంటి ఒక ఎమోషన్స్ తో కూడుకున్న పాత్రలో చూసి ఎంతో ఆనందానికి గురవుతున్నారు ఆయన అభిమానులు.
సలీం కుమార్( Salim Kumar )
మలయాళ సినిమాల్లో ఈ నటుడు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నారు సలీం ఆయన వయసు 41 ఉన్న సమయంలో ఆదామింటే మగన్ అబు అనే సినిమాలో ముఖ్యమైన పాత్ర కలిగిన సినిమాలో నటించారు.ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది సలీం అహ్మద్ తన మొదటి సినిమాలో ఇంత పెద్ద నటుడిని ఒక బరువైన పాత్ర చేయించాలని అనుకోవడం నిజంగా ఒక సాహసం.

కోవై సరళ( Kovai Sarala )
కోవై సరళ ప్రస్తుతం చాలా వయసు పెరగడంతో తక్కువగానే నటిస్తున్నారు కానీ మొన్నటికి మొన్న ఓటీటి లో సెంబి అనే ఒక సినిమా వచ్చింది.ఇందులో ఆమె బామ్మ పాత్రలో నటించిన విధానం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.

నగేష్( Nagesh )
నమ్మవర్ సినిమాలో 60 ఏళ్ల వయసులో నగేష్ నటించిన తీరు చూసి ఎంతో మంది ఆశ్చర్యపోయారు సౌత్ ఇండియాలో నగేష్ వంటి హాస్యనటుడు గురించి పరిచయం అవసరం లేదు ఆయన తన సినిమా జీవితంలో నటించారు.అయితే చాలామందికి ఈ సినిమా ఒక డ్రీమ్ రోడ్ లాగా ఉండిపోయింది.అంత అద్భుతంగా నగేష్ నటించారు.

ఉమా శ్రీ( Uma Shri )
కన్నడ సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటీమణి ఉమాశ్రీ.గులాబీ టాకీస్ అనే ఒక చిత్రంలో ముస్లిం మహిళగా గులాబీ అని పాత్రలో ఆమె నటించారు ఈ చిత్రానికి గిరీష్ కాసరవెల్లి దర్శకత్వం వహించారు సినిమా మొత్తం కూడా ఆమె చుట్టూనే దొరుకుతూ ఉంటుంది హాస్య నటిగా పేరుపొందిన ఉమా ఇలాంటి ఒక బరువైన పాత్ర పోషిస్తుందని ఎవరు ఊహించలేదు.