అధ్యక్షుడికి ఆ టెస్ట్ చేయాల్సిందేనా.. జో బైడెన్ వ్యక్తిగత వైద్యుడు ఏమన్నారంటే..?

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఇటీవల జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్ సందర్భంగా డెమొక్రాట్, రిపబ్లికన్ పార్టీల అభ్యర్ధులు అధ్యక్షుడు జో బైడెన్,( President Joe Biden ) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు తలపడ్డారు.ఈ సందర్భంగా బైడెన్‌పై ట్రంప్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించారు.

 Us President Biden's Doctor Reveals If President Requires Cognitive Test As Conc-TeluguStop.com

దీంతో బైడెన్ ఎన్నికల బరిలోంచి తప్పుకుని మరొకరికి అవకాశం కల్పించాలని సొంత పార్టీతో పాటు విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.

బైడెన్ మానసిక ఆరోగ్యం ఏమాత్రం బాలేదని జాతీయ స్థాయిలో విస్తృతమైన చర్చ జరుగుతోంది.

ఇటీవలికాలంలో జరిగిన కొన్ని ప్రధాన సంఘటనల సందర్భంగా బైడెన్ ప్రవర్తనే ఇందుకు కారణం.ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడి వ్యక్తిగత వైద్యుడు కెవిన్ ఓ కానర్( Personal physician Kevin O’Connor ) కీలక వ్యాఖ్యలు చేశారు.

జో బైడెన్‌కు ఎలాంటి ‘‘cognitive test’’ అవసరం లేదని తెలిపారు.వాషింగ్టన్ పోస్ట్ నివేదించిన ప్రకారం.బైడెన్ మూడు వార్షిక శారీరక పరీక్షల వ్యవధితో సహా రాష్ట్రాల అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఆయన ఎలాంటి టెస్టులు చేయించుకోలేదు.వైట్‌హౌస్ అధికారులు కూడా బైడెన్‌కు ‘‘cognitive test’’ చేయమని చెప్పలేదని ఓ కానర్ వెల్లడించారు.

Telugu Cognitive, Donald Trump, Joe Biden, Bidensreveals-Telugu NRI

అయితే వైట్‌హౌస్‌లో ఓకానర్‌కు అధికారిక సహచరులుగా ఉన్న కొందరు మాత్రం బైడెన్‌కు ఆ టెస్ట్ చేయాల్సిందేనని ఓ మీడియా సంస్థతో అన్నారు.అమెరికన్ ఆస్టియోపతిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇరా మోంకా కూడా ఇదే రకమైన సలహా ఇచ్చారు.తన మానసిక ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేందుకు అధ్యక్షుడు ఈ పరీక్ష చేయించుకుంటే మంచిదని మోంకా సూచించారు.అయితే శుక్రవారం ఏబీసీ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ‘‘cognitive test’’ అవసరం లేదంటూ బైడెన్ తేల్చిచెప్పారు.

Telugu Cognitive, Donald Trump, Joe Biden, Bidensreveals-Telugu NRI

ఇదే ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు.తాను పోటీ నుంచి తప్పుకోవడం లేదని, అస్వస్థత కారణంగానే డిబేట్‌లో తడబడ్డానని క్లారిటీ ఇచ్చారు.అధ్యక్ష ఎన్నికల బరిలోంచి తప్పుకోవాల్సిందిగా డెమొక్రాటిక్ పార్టీ నుంచి నుంచి తనను ఎవరూ కోరలేదని బైడెన్ తెలిపారు.అమెరికా అధ్యక్ష పదవికి తనకన్నా అర్హుడు మరొకరు లేరని ఆయన వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube