స్టార్ హీరోలే సగం డబ్బు దోచేస్తున్నారు.. కరణ్ జోహార్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్( Tollywood, Bollywood, Kollywood ) ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అనే తేడాల్లేకుండా అన్ని చోట్ల ప్రస్తుతం స్టార్ హీరోల హవా నడుస్తోంది.స్టార్ హీరోల పారితోషికాలు ఆకాశాన్ని తాకే స్థాయిలో ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 Karan Johar Sensational Comments About Heroes Remuneration Details Inside Goes-TeluguStop.com

స్టార్ హీరోలు భారీ స్థాయిలో పారితోషికాలు అందుకోవడం విషయంలో ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే.

ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్( Directed Karan Johar ) హీరోల రెమ్యునరేషన్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.మూడు కోట్లు వసూలు చేయని హీరో రూ.30 కోట్లు అడుగుతున్నారని కరణ్ జోహార్ షాకింగ్ కామెంట్స్ చేశారు.సినిమాల కథల విషయంలో ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయని ఆయన అన్నారు.ప్రేక్షకులకు భిన్నమైన సినిమా కావాలని కరణ్ తెలిపారు.

Telugu Bollywood, Karan Johar, Karanjohar, Kollywood, Stars, Tollywood-Movie

అలాంటి సినిమాను నిర్మించాలన్నా ఆన్ని సెంటర్లలో ఆడదని కేవలం మల్టీప్లెక్స్ లలో సినిమా ఆడితే సరిపోదని కరణ్ జోహార్ వెల్లడించారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో 10 మంది టాలెంటెడ్ యాక్టర్లు ఉన్నారని వాళ్లకు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వాలని ఆయన వెల్లడించారు.సినిమా నిర్మాణంలో లెక్కలు అర్థం కావని కరణ్ జోహార్ పేర్కొన్నారు.

Telugu Bollywood, Karan Johar, Karanjohar, Kollywood, Stars, Tollywood-Movie

కొన్ని ఖర్చులను ఎలా నియంత్రించాలో అర్థం కాదని కరణ్ జోహార్ వెల్లడించారు.మేము నిర్మాతలుగా సినిమాలు తీస్తూనే ప్రొడక్షన్ గురించి చర్చిస్తూ ఉండాలని ఆయన పేర్కొన్నారు.సినిమా తీయడం వెనుక చాలా డ్రామా ఉందని సినిమా కథాంశం అంతకు మించి ఉంటుందని కరణ్ జోహార్ పేర్కొన్నారు.

స్టార్స్( Stars ) సగం డబ్బునే దోచేస్తున్నారనే అర్థం వస్తుందనేలా ఆయన చెప్పుకొచ్చారు.కరణ్ జోహార్ చేసిన కామెంట్స్ నిజమేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

కరణ్ జోహార్ కు భాషతో సంబంధం లేకుండా మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube