సింగర్ కు 25 లక్షలు సహాయం చేసి మంచి మనస్సు చాటుకున్న అక్షయ్.. ఏమైందంటే?

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్( Akshay Kumar ) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అక్షయ్ కుమార్ కొన్ని సౌత్ సినిమాలలో నటించి ప్రశంసలు అందుకున్నారు.

 Akshay Kumar Help To Singer Daughter Details Inside Goes Viral , Akshay Kumar-TeluguStop.com

అక్షయ్ కుమార్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ తాజాగా ఒక సింగర్ కు 25 లక్షలు సహాయం చేసి మంచి మనస్సు చాటుకున్నారు.

అక్షయ్ కుమార్ వయస్సు ప్రస్తుతం 56 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.తెలుగులో ప్రస్తుతం కన్నప్ప సినిమాలో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు.

అక్షయ్ కుమార్ తాజాగా చేసిన పనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.ఒక సింగర్ కష్టాల్లో ఉందని తెలిసి అక్షయ్ కుమార్ ఏకంగా 25 లక్షల రూపాయల సహాయం చేశారు.

పంజాబ్ కు చెందిన గ్లోరి బవా(G lory Bawa ) అనే గాయని గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.తల్లి మరణం తర్వాత ఆమెకు ఈ ఇబ్బందులు మొదలయ్యాయి.

Telugu Akshay Kumar, Bollywood, Glory Bawa, Kannappa, Manchi Vishnu, Punjabi-Mov

ఒక ఇంటర్వ్యూలో గ్లోరి బవా మాట్లాడుతూ తన ఆర్థిక సమస్యల గురించి వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అయ్యాయి.గ్లోరి బవా తల్లి గుర్మిత్ బవా కూడా సింగర్ కాగా ఆమె పద్మ భూషణ్ అవార్డ్ గ్రహీత కావడం గమనార్హం.గుర్మిత్ బవా కూతురు కష్టాల్లో ఉన్నారని తెలిసిన వెంటనే ఎంతో బాధ పడ్డానని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు.ఒక అన్నయ్యగా ఆమెకు ఆర్థిక సహాయం చేశానని అక్షయ్ తెలిపారు.

Telugu Akshay Kumar, Bollywood, Glory Bawa, Kannappa, Manchi Vishnu, Punjabi-Mov

అక్షయ్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.అక్షయ్ కుమార్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.అక్షయ్ కుమార్ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.అక్షయ్ కుమార్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంపిక చేసుకుంటూ కెరీర్ పరంగా సత్తా చాటుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube