వివాహ పంచమి వ్రతం అంటే ఏమిటి.. ఈ వ్రతం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?

మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి నెల ఎన్నో రకాల పూజా కార్యక్రమాలను, వ్రతాలను నిర్వహిస్తూ ఉంటారు.ఇలా ఎంతో పవిత్రమైన వ్రతాలలో వివాహ పంచమి వ్రతం ఒకటి.

 Vivah Panchami 2021 Date Know When Is Vivah Panchami Its Importance Muhurt And W-TeluguStop.com

ఈ వివాహ పంచమి వ్రతం రోజు పెళ్లి కాని వారు వివాహ పంచమి వ్రతం చేయటం వల్ల వారికి తొందరగా వివాహ గడియలు వస్తాయని పండితులు చెబుతున్నారు.మరి ఎంతో పవిత్రమైన ఈ వివాహ పంచమి వ్రతం ఈ ఏడాది ఎప్పుడు వచ్చింది ఈ వ్రత ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

వివాహ పంచమి వ్రతం ప్రతి ఏడాది మార్గశిర మాసం శుక్ల పక్షంలో 5వ రోజు హిందువులు ఈ వ్రతాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు.ఈ క్రమంలోనే ఈ ఏడాది ఈ వ్రతం డిసెంబర్ 8 వ తేదీ వచ్చింది.

ఈ రోజున సాక్షాత్తు సీతాదేవి శ్రీరామచంద్రుడు వివాహం చేసుకున్నారని పురాణాలు చెప్పడంతో ప్రతి ఏడాది ఈ రోజున సీతారాముల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ వివాహ పంచమి వ్రతాన్ని జరుపుకుంటారు.ఈ పంచమి రోజు సీతారాముల ప్రతిమలను ప్రతిష్టించి వారికి వివాహం జరిపించి వివిధ రకాల నైవేద్యాలతో పూజించడం వల్ల వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది.

వివాహ పంచమి వ్రతం చేయడానికి వివాహ పంచమి తేదీ 07 వ తేదీ డిసెంబర్ 2021 రాత్రి 11 గంటలకు ప్రారంభమయి.08 వ తేదీ డిసెంబర్ 2021 రాత్రి 09 గంటల 25 నిమిషాలకు ముగుస్తుంది.ఈ సమయంలో ఈ వ్రతం ఆచరించడం వల్ల వివాహంలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోయి అనంతరం వివాహం జరగడమే కాకుండా వీరి వైవాహిక జీవితంలో ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా గడుపుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube