అధిక బరువు దూరం చేసుకోనీ, ఆరోగ్యంగా ఉండాలని, కండలు పెరగాలని ఇలా చాలామంది జిమ్ లకు క్యూ కడుతూ ఉంటారు.కానీ పైకి ఎంత ఫీట్ గా కనిపించినా వ్యాయామం చేస్తూనే ఇటీవల కాలంలో చాలామంది ప్రజలు గుండెపోటుతో మరణిస్తున్నారు.
వారిలో ఎక్కువ శాతం యువతే ఉన్నారు.ఇలా ఉన్నట్టుండి గుండెపోటుకు గురై మరణించడం వెనుక కారణాలేంటి అన్నది ఆరా తీస్తే పోస్ట్ కోవిడ్ లక్షణాలు అయి ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఎక్కువగా బిర్యానీలు తినడం ఆల్కహాల్ తీసుకోవడం కూడా కావచ్చని చెబుతున్నారు.
రోజు వ్యాయామం( Exercise ) చేస్తున్నాం కదా మాకేం రోగాలు ఉండవు అనుకుంటే మాత్రం పొరపాటే.
వ్యాయామం చేసేటప్పుడు మీకు ఈ లక్షణాలు కనిపిస్తే మీకు కూడా గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లే.మరి ఆ లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే జిమ్ లో వ్యాయామం చేస్తున్న సమయంలో సాధారణంగా ఎక్కువ అలసటగా ఉంటే వెంటనే వ్యాయామం చేయడం ఆపివేయాలి.అధిక అలసట ఉంటే అది మీకు గుండె సమస్య ఉందనడానికి సంకేతం.
చెడు కొలెస్ట్రాల్ ( Bad Cholesterol )రక్తనాళాలను నిరోధిస్తుంది.ఫలితంగా రక్తపోటును ప్రభావితం చేయడం ద్వారా గుండె సమస్య వస్తుంది.
వ్యాయామం చేస్తున్న సమయంలో శ్వాస తీసుకోవడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది.కానీ రోజు ఉండే ఇబ్బంది కంటే ఎక్కువగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తే మాత్రం అది గుండె సమస్యలకు కారణం అవుతుంది.ఈ లక్షణం కనిపించిన వెంటనే వ్యాయామం చేయడం ఆపివేయడమే మంచిది.లేదంటే హార్ట్ ఫెయిల్యూర్( Heart failure ) కు దారి తీసే అవకాశం ఎక్కువగా ఉంది.
ఇంకా చెప్పాలంటే జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి లక్షణాలు కనిపించినా వెంటనే వర్కౌట్స్ ఆపివేయాలి.
ఇంకా చెప్పాలంటే వ్యాయామం చేసే సమయంలో ఛాతీ లో నొప్పి వస్తే, అలాగే తల తిరగడం, కళ్ళు తిరగడం లాంటి లక్షణాలు కనిపించినా వెంటనే వ్యాయామం ఆపివేసి వైద్యులను సంప్రదించడం మంచిది.జిమ్ చేసేటప్పుడు కొందరు డిహైడ్రేషన్ కు గురవుతూ ఉంటారు.వేగంగా వ్యాయామం చేయడం వల్ల అలా జరుగుతుందని అనుకుంటూ ఉంటారు.
కానీ ఈ సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం అది శరీరంలో లోపం గా గుర్తించాలి.