నల్గొండ జిల్లా నడికుడిలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.గ్రామ సమీపంలో ఉన్న పొలంలో చిరుతపులి సంచరిస్తుండగా కొందరు స్థానికులు గుర్తించారు.
చిరుత సంచారం నేపథ్యంలో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పొలాల్లో ఉన్న పాదముద్రలను పరిశీలించారు.
అయితే గుర్తించిన పాదముద్రలపై అధికారులు స్పష్టత లేదని చెబుతున్నారు.ఈ క్రమంలోనే చిరుతపులి పాదముద్రలా లేక హైనా పాదముద్రలా అన్న కోణంలో ఫారెస్ట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.