ప్రపంచం టెక్నాలజీ విషయంలో రోజురోజుకు ఎంతో అభివృద్ధి చెందుతూ ముందుకు దూసుకు వెళ్తోంది.మనిషి ఎక్కడికి వెళ్ళినా అవసరాలు తీర్చడం కోసం పోర్టబుల్ వస్తువులు( Portable Items ) అందుబాటులోకి వచ్చాయి.
ప్రపంచంలో ఎక్కడైనా ఎంత విలాసంగా అయినా జీవించగలిగే సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.ఈ క్రమంలోనే పోర్టబుల్ టచ్ స్క్రీన్ టీవీలు అందుబాటులోకి వచ్చేసాయి.
ఇక ఎక్కడికెళ్లిన టీవీ చూడాలి అనుకునే వారు ఈ పోర్టబుల్ టీవీతో( Portable TV ) ఆ సమస్యకు పెట్టవచ్చు.
ప్రముఖ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఎల్ జీ ఎలక్ట్రానిక్స్( LG Electronics ) తాజాగా స్టాండ్ బై మీ గో( StanbyMe Go ) పేరుతో ఓ సరికొత్త పోర్టబుల్ టచ్ స్క్రీన్ టీవీని లాంచ్ చేసింది.
ఈ టీవీ ఒక ట్రావెలింగ్ సూట్ కేస్ తో వస్తుంది.ఈ సూట్ కేస్ లో టచ్ స్క్రీన్ టీవీ, స్పీకర్స్, పవర్ సప్లై అన్నీ ఉంటాయి.
ఈ సూట్ కేస్ ను సులభంగా ఎక్కడికైనా తీసుకు వెళ్ళవచ్చు.ఇందులో ఉండే టీవీ 27 అంగుళాల సైజు కలిగి ఉంటుంది.
స్వివెల్ డిజైన్ తో వచ్చే స్టాండ్ బై మీ గో టీవీ స్క్రీన్ ను 360 డిగ్రీలు తిప్పవచ్చు.ఇందులో 20W స్పీకర్స్ తో అద్భుతమైన ఆడియో ఎక్స్పీరియన్స్ ఆస్వాదించవచ్చు.ఈ స్మార్ట్ టీవీలో( Smart TV ) ఇన్-బిల్ట్ బ్యాటరీ ఉంటుంది.ఈ ఎల్ జీ టీవీ సొంత web OS తో రన్ అవుతుంది.ఈ OS లో నెట్ ఫిక్స్లు, హులు, అమెజాన్ ప్రైమ్ వీడియోలతో సహా పలు రకాల స్ట్రీమింగ్ యాప్ లను యాక్సెస్ చేసుకోవచ్చు.
ఈ టీవీ ఆపిల్ ఎయిర్ ప్లే, బ్లూటూత్ పెయిరింగ్, wi-fi కి మద్దతు ఇస్తుంది.ఈ టీవీ 1080P రిజల్యూషన్ డిస్ ప్లే తో వస్తుంది.ఈ టీవీ ధర 999 డాలర్లు.మన భారత కరెన్సీలో దాదాపుగా రూ.83 వేలు. ఆగస్టు చివరి వారంలో దీని డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఇతర దేశాలలో ఈ సూట్ కేస్ టీవీ రిలీజ్ అయింది కానీ భారత్ లో ఇంకా లాంచ్ కాలేదు ఈ విషయంపై కంపెనీ కూడా ఎలాంటి అధికార ప్రకటన ఇంకా చేయలేదు.