గులాబీ పూలతో హోమ్ మేడ్ క్రీమ్.. రోజు వాడితే ఊహించని బెనిఫిట్స్ మీవే!

గులాబీ పూలు.అలంకరణకే కాదు అందాన్ని పెంచడానికి కూడా ఎంతో బాగా సహాయపడతాయి.

వివిధ రకాల చర్మ సమస్యలను నివారించడానికి ఉపయోగపడతాయి.ముఖ్యంగా గులాబీ పూలతో ఇంట్లోనే ఇప్పుడు చెప్పబోయే విధంగా ఫేస్ క్రీమ్ ను తయారు చేసుకుని వాడితే ఊహించని స్కిన్ కేర్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం గులాబీ పూలతో ఎలా ఫేస్ క్రీమ్ ను తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందు రెండు నుంచి మూడు గులాబీ పూలు తీసుకుని వాటికి ఉండే రేకులను వేరు చేసుకోవాలి.

ఈ గులాబీ రేకులను వాటర్ లో కడగాలి.ఆ తర్వాత మిక్సీ జార్ లో గులాబీ రేకులు వేసి రెండు టేబుల్ స్పూన్లు రోజ్‌ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్‌ సహాయంతో రోజ్ జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, హాఫ్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్ తో పాటు చివరగా మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు రోజ్‌ వాటర్ వేసుకుని స్పూన్ సహాయంతో కనీసం ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Tips, Face Cream, Skin Clear Skin, Latest, Rose Cream, Rose Flowers, Skin

తద్వారా మన క్రీమ్‌ సిద్ధం అవుతుంది.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ముఖానికి ఉన్న మేకప్ ను తొలగించి వాటర్ తో వాష్ చేసుకోవాలి.అనంతరం తయారు చేసుకున్న రోజ్ క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకుని రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

ఈ హోమ్ మేడ్ రోజ్ క్రీమ్ ను రెగ్యులర్ గా వాడటం వల్ల స్కిన్ టోన్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.

Telugu Tips, Face Cream, Skin Clear Skin, Latest, Rose Cream, Rose Flowers, Skin

చర్మం హైడ్రేటెడ్ గా, గ్లోయింగ్ గా మెరుస్తుంది.పిగ్మెంటేషన్ సమస్య దూరం అవుతుంది.కళ్ళ చుట్టూ నల్లటి వల‌యాలు ఉంటే క్రమంగా మాయం అవుతాయి.

అలాగే ఈ రోజ్ క్రీమ్ ను వాడటం వల్ల ముడ‌త‌లు త్వరగా రాకుండా ఉంటాయి.మచ్చలు మాయం అవుతాయి.

ఓపెన్ పోర్స్ సైతం క్లోజ్ అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube