రంగు, రుచి విషయంలో చాలా ఆకర్షణీయంగా కనిపించే బీట్ రూట్ లో పోషకాలు కూడా మెండుగా ఉంటాయి.అనేక రకాల విటమిన్స్, మినరల్స్ బీట్ రూట్ ద్వారా పొందవచ్చు.
అనేక జబ్బులకు బీట్ రూట్ తో అడ్డుకట్ట వేయొచ్చు.అయితే బీట్ రూట్ ( Beetroot )ను చాలా మంది కూర లేదా పచ్చడి రూపంలో తీసుకుంటా.
రు కొందరు పచ్చిగా తింటూ ఉంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే ఆరోగ్యపరంగా బోలెడు ప్రయోజనాలు మీ సొంతమవుతాయి.

అందుకోసం ముందుగా ఒక బీట్ రూట్ ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్కలు వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం తురుము,( Grate ginger ) వన్ టేబుల్ స్పూన్ పచ్చి పసుపు కొమ్ము తురుము, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి. ఈ బీట్ రూట్ టర్మరిక్ జ్యూస్ ( Beet Root Turmeric Juice )ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.బీట్ రూట్ లో ఉండే పోషకాలు మరియు పసుపులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ మన ఆరోగ్యానికి అండగా నిలుస్తాయి.
ముఖ్యంగా ఈ బీట్ రూట్ టర్మరిక్ జ్యూస్ శరీరంలోని వ్యర్థాలను విషాన్ని తొలగిస్తుంది.బాడీని డీటాక్స్ చేస్తుందిఅలాగే రక్తాన్ని శుద్ధి చేయడానికి కూడా అద్భుతంగా సహాయపడుతుంది.అంతేకాదు రెండు రోజులకు ఒకసారి ఈ జ్యూస్ ను తీసుకుంటే శరీరానికి అవసరం అయ్యే ఐరన్ కంటెంట్ అందుతుంది.హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.
ఫలితంగా రక్తహీనత దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.ఈ బీట్ రూట్ టర్మరిక్ జ్యూస్ మూత్రపిండాలు మరియు కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది.
ఒత్తిడిని చిత్తు చేస్తుంది.మెదడు చురుగ్గా పని చేసేలా సైతం ప్రోత్సహిస్తుంది.