ప్రముఖ జ్యోతిష్యుడుగా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచినటువంటి వారిలో ఆస్ట్రాలజర్ వేణు స్వామి ( Venu Swamy ) ఒకరు.ఈయన ప్రముఖుల జాతకాలను చెబుతూ వార్తలలో నిలిచారు.
అయితే ఈ మధ్యకాలంలో వేణు స్వామి రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాల గురించి అదే విధంగా సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన విషయాల గురించి పెద్ద ఎత్తున మాట్లాడుతూ వారి జాతకాలను చెబుతూ వార్తలలో నిలుస్తున్నారు.ఈయన గతంలో సమంత గురించి చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి.
సమంత నాగచైతన్య పెళ్లి చేసుకోబోతున్నారని విషయం తెలియడంతో పెళ్లి చేసుకున్న వారు విడిపోతారని చెప్పారు.
సమంత విషయంలో వేణు స్వామి మాటలు అక్షరాల నిజమయ్యాయి.
ఇలా సమంత విషయంలో మాత్రమే కాకుండా పలువురు సినిమా సెలబ్రిటీల విషయంలో కూడా ఈయన చెప్పే జాతకాలు నిజం కావడంతో ఈయనని అనుసరించే వారి సంఖ్య ఎక్కువైంది.అయితే ఇటీవల ఈయన చెప్పే జాతకాలు నిజం కాకపోవడంతో వేణు స్వామి గురించి కూడా ట్రోల్స్ మొదలయ్యాయి.
తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారు అంటూ వేణు స్వామి చెప్పారు.అయితే కేసీఆర్ ( KCR )ఓడిపోవడం గమనార్హం.ఇక సలార్ సినిమా కూడా సక్సెస్ కాదు అని చెప్పారు కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది.

ఇలా వేణు స్వామి చెప్పిన మాటల్లో నిజం కాకపోవడంతో ఈయనపై ట్రోల్స్ మొదలయ్యాయి.అయితే తాజాగా వేణు స్వామికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వేణు స్వామి మెయిన్ బిజినెస్ జాతకాలు చెప్పడం కాదని ఈయన జాతకాలు చెప్పడం కేవలం సైడ్ బిజినెస్ అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.
మరి ఈయన మెయిన్ బిజినెస్ ఏంటి అనే విషయానికి వస్తే వేణు స్వామి పబ్( Pub ) నిర్వహిస్తున్నారట.ఇదే తన మెయిన్ బిజినెస్ అని తెలుస్తుంది.

ఇలా పబ్ నిర్వహించడం గురించి గతంలో వేణు స్వామి ఓ సందర్భంలో తెలియచేశారు.తన జాతకం ప్రకారం తనకు ఏ రంగం అయితే కలిసి వస్తుందోనని ఈయన తన జాతకాన్ని చూసుకొని తనకు పబ్ నిర్వహించే బిజినెస్ అయితే బాగుంటుందని అందుకే తాను ఈ రంగంలోకి అడుగు పెట్టానని ఈ విషయంలో తనకు ఏ విధమైనటువంటి నిర్మొహమాటం లేదు అంటూ వేణు స్వామి తెలియజేశారు.ఇలా ఈయన పబ్ నిర్వహిస్తున్నారనే విషయం తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.అమ్మా వేణు స్వామి జ్యోతిష్యుడుగా గుర్తింపు పొంది మెయిన్ బిజినెస్ పబ్ నడపడమా ఇది కేవలం సైడ్ బిజినెస్ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.







