మా అమ్మకు పద్మశ్రీ ఎందుకు ఇవ్వలేదు.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నరేష్( Sr Naresh ) తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపును సొంతం చేసుకున్నారు.సంక్రాంతి కానుకగా విడుదలైన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలలో సీనియర్ నరేష్ నటించి తన నటనతో మెప్పించారు.

 Senior Naresh Sensational Comments About Padma Shri Award To Vijaya Nirmala Deta-TeluguStop.com

అయితే తాజాగా సీనియర్ నరేష్ మాట్లాడుతూ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.మా అమ్మకు పద్మశ్రీ( Padma Shri ) ఎందుకు ఇవ్వలేదు అంటూ నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

విజయనిర్మల( Vijaya Nirmala ) 46 సినిమాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళా దర్శకురాలు అని నరేష్ అన్నారు.నేను ఢిల్లీ స్థాయిలో అమ్మ విజయ నిర్మలకు పద్మ అవార్డ్ కోసం ప్రయత్నించినా ఫలితం లెకుండా పోయిందని ఆయన కామెంట్లు చేశారు.

అమ్మ పద్మ అవార్డ్ కోసం కేసీఆర్ గారు రికమెండ్ చేశారని నరేష్ వెల్లడించారు.నేను ఏ ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని నరేష్ కామెంట్లు చేశారు.

Telugu Mahesh Babu, Senior Naresh, Krishna, Veteranactress, Vijaya Nirmala, Vija

బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా ఆ స్థాయి వ్యక్తులకు అవార్డులు ఇస్తున్నారని ఈ విషయంలో సంతోషంగా ఉందని నరేష్ అన్నారు.ఎంజీఆర్ గారు( MGR ) బ్రతికున్నప్పుడు పద్మ అవార్డ్ రాలేదని సీనియర్ ఎన్టీఆర్( Sr NTR ) గారికి కూడా రాలేదని ఆయన తెలిపారు.తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఆ అర్హత కలిగిన వాళ్లు ఉన్నారని నరేష్ పేర్కొన్నారు.అమ్మకు పద్మశ్రీ అవార్డ్ కోసం ప్రయత్నిస్తానని ఆయన అన్నారు.

Telugu Mahesh Babu, Senior Naresh, Krishna, Veteranactress, Vijaya Nirmala, Vija

మన వాళ్లకు పద్మ అవార్డ్ వచ్చే వరకు ఆమరణ నిరాహారదీక్ష చేసినా తప్పులేదని నరేష్ వెల్లడించారు.సీనియర్ నరేష్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.సీనియర్ నరేష్ తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సీనియర్ నరేష్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.సీనియర్ నరేష్ కు వయస్సు పెరుగుతుండగా ఆఫర్లు సైతం పెరుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube