తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో రామ్ చరణ్…( Ram Charan ) ఇక ఇప్పటివరకు ఆయన చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో రీసెంట్ గా శంకర్ డైరెక్షన్ లో ఆయన చేసిన ‘గేమ్ చేంజర్( Game Changer ) సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన అభిమానులు కొంతవరకు నిరాశ చెందుతున్నారనే చెప్పాలి.ఇక గేమ్ చేంజర్ సినిమా అంత వరస్ట్ గా అయితే లేదు.
ఆవరేజ్ టాక్ ను సంపాదించుకున్న ఈ సినిమా డిజాస్టర్ గా మిగడానికి గల కారణం ఏంటి అంటే సినిమా మీద చాలామంది చాలా రకాల కుట్రను చేసి తొక్కేసే ప్రయత్నం చేశారంటూ నిర్మాత దిల్ రాజు( Dil Raju ) చాలా వరకు తన ఆవేదనను వ్యక్తం చేశారు.మరి ఏది ఏమైనా కూడా కొంత మంది మొదటినుంచి కూడా మెగా ఫ్యామిలీ( Mega Family ) మీద చాలా రకాల కుట్రలు చేస్తూ వస్తున్న విషయం మనకు తెలిసిందే.చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ప్రొడ్యూసర్లు సైతం మెగా ఫ్యామిలీతో సన్నిహితంగా ఉంటే కొంతమంది మాత్రం వాళ్ళ మీద కుట్రలు చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు.ఇక అందులో భాగంగానే ఈ గేమ్ చేంజర్ మీద అలాంటి ప్రయత్నం చేశారంటూ ఆయన తన ఆవేదనని వ్యక్తం చేశారు.
మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం దిల్ రాజు ‘గేమ్ చేంజర్’ సినిమాతో కాకుండా ‘సంక్రాంతికి వస్తున్నాం’( Sankranthiki Vasthunnam ) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.కాబట్టి ఒక సినిమాతో మైనస్ అయింది.మరొక సినిమాతో ప్లస్ చేశాను అంటూ దిల్ రాజు చాలా వరకు కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది… చూడాలి మరి రాబోయే సినిమాతో ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది…