మెగా ఫ్యామిలీని తొక్కేయాలని చూస్తుంది ఎవరు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో రామ్ చరణ్.

( Ram Charan ) ఇక ఇప్పటివరకు ఆయన చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో రీసెంట్ గా శంకర్ డైరెక్షన్ లో ఆయన చేసిన 'గేమ్ చేంజర్( Game Changer ) సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన అభిమానులు కొంతవరకు నిరాశ చెందుతున్నారనే చెప్పాలి.

ఇక గేమ్ చేంజర్ సినిమా అంత వరస్ట్ గా అయితే లేదు. """/" / ఆవరేజ్ టాక్ ను సంపాదించుకున్న ఈ సినిమా డిజాస్టర్ గా మిగడానికి గల కారణం ఏంటి అంటే సినిమా మీద చాలామంది చాలా రకాల కుట్రను చేసి తొక్కేసే ప్రయత్నం చేశారంటూ నిర్మాత దిల్ రాజు( Dil Raju ) చాలా వరకు తన ఆవేదనను వ్యక్తం చేశారు.

మరి ఏది ఏమైనా కూడా కొంత మంది మొదటినుంచి కూడా మెగా ఫ్యామిలీ( Mega Family ) మీద చాలా రకాల కుట్రలు చేస్తూ వస్తున్న విషయం మనకు తెలిసిందే.

చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ప్రొడ్యూసర్లు సైతం మెగా ఫ్యామిలీతో సన్నిహితంగా ఉంటే కొంతమంది మాత్రం వాళ్ళ మీద కుట్రలు చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

ఇక అందులో భాగంగానే ఈ గేమ్ చేంజర్ మీద అలాంటి ప్రయత్నం చేశారంటూ ఆయన తన ఆవేదనని వ్యక్తం చేశారు.

"""/" / మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం దిల్ రాజు 'గేమ్ చేంజర్' సినిమాతో కాకుండా 'సంక్రాంతికి వస్తున్నాం'( Sankranthiki Vasthunnam ) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.

కాబట్టి ఒక సినిమాతో మైనస్ అయింది.మరొక సినిమాతో ప్లస్ చేశాను అంటూ దిల్ రాజు చాలా వరకు కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది.

చూడాలి మరి రాబోయే సినిమాతో ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది.

లండన్‌: ఇదేం ఖర్మరా బాబు.. లక్ష అద్దె కట్టినా చిల్లుల కొంపే.. భారతీయుడి ఆవేదన!