మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Varun Tej ) ఒకరు.వరుణ్ ముందు నుండి హిట్ ప్లాప్ అని రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం పొందాడు.
సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ సినిమా సినిమాకు తాను ఎంచుకునే స్క్రిప్ట్ లతో అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఇక వరుస హిట్స్ అందుకుంటున్న వరుణ్ తేజ్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ప్రజెంట్ వరుణ్ తేజ్ క్రేజీ లైనప్ సెట్ చేసుకుంటున్నాడు.ఆ లైనప్ లో ముందుగా రిలీజ్ కానున్న మూవీ ‘‘గాండీవధారి అర్జున” ( Gandeevadhari Arjuna ).ప్రవీణ్ సత్తారు ( Praveen Sattaru ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.
అందుకే మేకర్స్ ఒక్కొక్కటిగా అన్ని పనులు పూర్తి చేస్తున్నారు.
ఇటీవలే హై వోల్టేజ్ టీజర్ ను రిలీజ్ చేసి సినిమాపై హైప్ పెంచేశారు.ఇది కూడా మరో కొత్త ప్రయోగం అని చెప్పకనే చెప్పారు.
ఇక ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ఈ యాక్షన్ థ్రిల్లర్ కు యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.
అయితే రన్ టైం మాత్రం ఇంకా వెల్లడించలేదు.
ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య ( Sakshi Vaidya ) హీరోయిన్ గా నటిస్తుండగా.మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.అలాగే ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో తెలియాలంటే ఆగస్టు 25 వరకు వేచి ఉండాల్సిందే.