కన్నడ స్టార్ హీరో దర్శన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ మధ్య కాలంలో ఒక హత్య కేసులో దర్శన్( Darshan ) అరెస్ట్ అయ్యి ప్రస్తుతం దర్శన్ జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.
గడిచిన 26 రోజులుగా దర్శన్ జైలులో ఉన్నారు.జైలులో ఉన్నప్పటి నుంచి దర్శన్ సరిగ్గా ఆహారం తీసుకోవడం లేదని తెలుస్తోంది.
జైలు ఫుడ్ దర్శన్ కు నచ్చలేదని కూడా సమాచారం అందుతుండటం గమనార్హం.
దర్శన్ ఇదే విధంగా బరువు తగ్గితే అతని ఆరోగ్యానికి ప్రమాదమనే కామెంట్లు సైతం వ్యక్తమవుతూ ఉన్నాయి.
జైలులో దర్శన్ ఒంటరిగా ఉంటున్నారని ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడటం లేదని భోగట్టా.దర్శన్ కు ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలను ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నారని సమాచారం అందుతోంది.
దర్శన్ త్వరగా కోలుకోవాలని ఈ సమస్యల నుంచి బయటపడాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

దర్శన్ ఈ కేసు నుంచి బయటపడటం సులువు కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ నెల 18 వరకు దర్శన్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించారని సమాచారం అందుతోంది.దర్శన్ ఎటువంటి తప్పు చేయలేదంటూ కొంతమంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
దర్శన్ అరెస్ట్ ( Darshan arrested )కావడం ఆయన ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెడుతోంది.

ఈ కేసు వల్ల దర్శన్ కెరీర్ కూడా ప్రమాదంలో పడినట్టేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.దర్శన్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్స్ పరిస్థితి ఏంటని సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుండటం గమనార్హం.దర్శన్ ఈ వివాదాల నుంచి బయటపడతారో లేదో చూడాల్సి ఉంది.
దర్శన్ కు సపోర్ట్ చేస్తున్న సెలబ్రిటీలపై కూడా కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.స్టార్ హీరో దర్శన్ ఇలాగే బరువు తగ్గితే అతని ప్రాణాలకే ప్రమాదమని కామెంట్లు వినిపిస్తున్నాయి.








