టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకొని నేడు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ ( NTR ) ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అయ్యారు.ఈయన చివరిగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాలో నటించారు.
ఈ సినిమా తర్వాత ఎలాంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాలేదు.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సినిమాల కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ ( Koratala Shiva ) దర్శకత్వంలో దేవర సినిమా( Devara Movie )లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా పట్ల ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి.ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేశాయి.ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
మొదటి భాగం సెప్టెంబర్ 27 తేదీ విడుదల కానుంది.అయితే ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది ఏంటి అనే విషయాల గురించి ఇప్పటివరకు మేకర్స్ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు కానీ ఇటీవల థాయిలాండ్ లో ఓ పాట చిత్రీకరణ కోసం వెళ్లారన్న అప్డేట్ మాత్రమే ఇచ్చారు.

ఇకపోతే తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిందని తాజాగా నటి హిమజ ( Himaja ) చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.బుల్లితెర నటిగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న హిమజ ప్రస్తుతం సినిమాలలో వివిధ పాత్రలలో నటిస్తున్నారు.ఈ క్రమంలోనే దేవర సినిమాలో కూడా నటించిన ఈమె తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులను మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే డబ్బింగ్ స్టూడియోలో ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేస్తూ డబ్బింగ్ చెబుతున్నానని తాను కూడా దేవరకోసమే ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని వెల్లడించారు.
ఇలా ఈమె ఈ పోస్ట్ చేయడంతో దేవర షూటింగ్ పూర్తి అయిపోయిందని స్పష్టమవుతుంది.ఇక త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసి ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టబోతున్నారని తెలుస్తుంది.