ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల డ్రీమ్ రోల్స్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో పదుల సంఖ్యలో స్టార్ హీరోయిన్లు ఉన్నారు.ఈ హీరోయిన్లలో ఎక్కువమంది హీరోయిన్లు ప్రస్తుతం భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ను అందుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

 These Star Heroines Dream Roles Details Inside Goes Viral Social Media ,rashmi-TeluguStop.com

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రష్మిక( Rashmika Mandanna ) భవిష్యత్తులో సౌందర్య బయోపిక్ తీస్తే అందులో నటించాలని ఉందని ఆమె పేర్కొన్నారు.తాను సినిమాల్లోకి రాకముందు నుంచి సౌందర్యకు అభిమానినని ఆమె వెల్లడించారు.

Telugu Soundarya, Sreeleela, Tollywood-Movie

నేను కొన్నిసార్లు సౌందర్యలా కనిపిస్తానని కూడా కామెంట్లు వినిపించాయని రష్మిక తెలిపారు.పూర్తిస్థాయి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాలని నా కోరిక అని అనుపమ పరమేశ్వరన్( Anupama Parameswaran ) తెలిపారు.ఇప్పటికే అ.ఆ, టిల్లూ స్క్వేర్ సినిమాల్లో కొంతమేర నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో ఈ బ్యూటీ నటించిన సంగతి తెలిసిందే.స్టార్ హీరోయిన్ సాయిపల్లవి కామెడీ రోల్ కోసం చూస్తున్నానని వెల్లడించడం గమనార్హం.

Telugu Soundarya, Sreeleela, Tollywood-Movie

నేను కథ, డ్యాన్స్ ప్రాధాన్యం ఉన్న సినిమాలలో నటించానని ఆమె పేర్కొన్నారు.పూర్తిస్థాయిలో కామెడీ రోల్ లో నటించాలని ఉందని సాయిపల్లవి వెల్లడించారు.పల్లెటూరి బ్యాక్ డ్రాప్ సినిమాలలో నటించాలని ఉందని శ్రీలీల( Sreeleela ) తెలిపారు.

హిస్టారికల్ సినిమాలలో సైతం నాకు నటించాలని ఉందని శ్రీలీల పేర్కొన్నారు.ఒకేతరహా పాత్రల్లో నటించడం నాకు నచ్చదని ఆమె వెల్లడించారు.

మరో హీరోయిన్ రీతూ వర్మ మాట్లాడుతూ కుదిరితే రా ఏజెంట్ రోల్ లో చేయాలని ఉందని పేర్కొన్నారు.గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో నటించాలని నా కోరిక అని కనులు కనులను దోచాయంటే సినిమాతొ ఆ కల నిజమైందని రీతూ వర్మ తెలిపారు.

ఈ స్టార్ హీరోయిన్ల డ్రీమ్ రోల్స్ తెలిసి నెటిజన్లు సైతం షాకవుతున్నారు.రాబోయే రోజుల్లో ఈ స్టార్ హీరోయిన్ల కోరికలు నిజమవుతాయేమో చూడాల్సి ఉంది.

దర్శకులు హీరోయిన్లకు ఇలాంటి పాత్రలు ఇచ్చి ప్రోత్సహిస్తారేమో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube