దాసరి నారాయణ రావు.తన చివరి శ్వాస వరకు సినిమా రంగానికి ఎంతో సేవ చేశాడు.
టాలీవుడ్ లో ఏ వివాదం చెలరేగినా దాన్ని పరిష్కరించడంలో ముందుండేవారు.అంతేకాదు ఈ దర్శకరత్నకు ఏదైనా ముఖం మీదే చెప్పే అలవాటు ఉంది.
ఉన్నది ఉన్నట్లు ముఖంమీద కొట్టినట్లు మాట్లాడుతారు.తనకు ఏ విషయం నచ్చకపోయినా వెంటనే చెప్పేవాడు.
సినిమా రంగంలో ఎన్టీఆర్ తో ఎన్నో సంచలన విజయాల సినిమాలన తీసినా.రాజకీయంగా మాత్రం వ్యతిరేకించాడు దాసరి.
ఆయన వ్యవహార శైలిని కూడా తప్పు బట్టాడు.అటు మీడియా ముసుగులో గుత్తాధిపత్యం చెలలాయించేందుకు రామోజీ ఈనాడు ప్రయత్నించగా.
ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు దాసరి.ఈనాడు తలదన్నేలా ఉదయం పత్రిక స్థాపించి ఎన్నో నిజాలను వెలుగులోకి తెచ్చాడు.
అంతేకాదు.ఎన్టీఆర్ పాలనలోని తోపాలను ఎత్తి చూపుతూ తన సినిమాల్లో సీన్లు రూపొందించేవాడు.
విజయశాంతి మెయిన్ రోల్ లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఒసేయ్ రాములమ్మ.రాజకీయంగా, సినిమా రంగంలో ఈ చిత్రం ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసింది.
ఆ సినిమా పరోక్షంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని పతనం చేసేందుకు ఉపయోగపడింది.

చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు.అదే సమయంలో మోహన్ బాబుతో ఆయన మేస్త్రీ సినిమా చేశాడు.ఈ సినిమాలో చిరును టార్గెట్ చేశాడు దాసరి.

వీరేకాదు.మర్రి చెన్నారెడ్డిని కూడా దాసరి టార్గెట్ చేశాడు.మర్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పాలనతో పాటు ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు.ఇందుకోసం ఓ సినిమానే తెరకెక్కించాడు.దాని పేరు ఎమ్మెల్యే ఏడు కొండలు.ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపడంలో ఏమాత్రం వెనుకడుగు వేయలేదు.
దాసరి ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపడంలో ఏనాడు వెనుకడుగు వేయలేదు.తన సినిమాలనే అస్త్రాలుగా మార్చుకుని అవినీతి, అక్రమాలపై దండెత్తాడు దాసరి.