ప్రస్తుత ఈ చలికాలంలో ప్రధానంగా వేధించే సమస్యల్లో గొంతు నొప్పి( Sore throat ) ఒకటి.పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా మనలో చాలా మంది ఈ సమస్యతో సఫర్ అవుతూ ఉంటారు.
గొంతు నొప్పి అనేది చిన్నదే అయినా తీవ్రమైన అసౌకర్యానికి కారణం అవుతుంది.అలాగే గొంతు నొప్పి వల్ల మాట్లాడాలన్నా, తినాలన్నా, తాగాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది.
ఈ క్రమంలోనే గొంతు నొప్పిని తగ్గించుకోవడం కోసం మందులు వాడుతుంటారు.కానీ సహజంగా కూడా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు అద్భుతంగా సహాయపడతాయి.

గొంతు నొప్పిని నివారించడానికి మెంతులు అద్భుతంగా తోడ్పడతాయి.వన్ టేబుల్ స్పూన్ మెంతులను( Fenugreek Water ) ఒక గ్లాస్ వాటర్ లో వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో నానబెట్టుకున్న మెంతులను వాటర్ తో సహా వేసుకుని 10 నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత వాటర్ ను ఫిల్టర్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ తేనె ( Honey )కలిపి గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే కనుక గొంతు నొప్పి పరారవుతుంది.
లేదా మీరు దాల్చిన చెక్క టీ( Cinnamon tea ), పుదీనా టీ, ములేటి టీ వంటివి తీసుకున్న కూడా గొంతు నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

అలాగే చాలామంది జలుబు చేసినప్పుడు ఆవిరి పడుతుంటారు.అయితే జలుబు ఉన్నప్పుడే కాదు గొంతు నొప్పి ఉన్న సరే రోజుకు రెండు సార్లు ఆవిరి పట్టండి.తద్వారా గొంతులో ఏమైనా ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా ఉంటే నాశనం అవుతుంది.
గొంతు నొప్పి సమస్య త్వరగా దూరమవుతుంది.ఇక ఒక గ్లాసు వాటర్ లో రెండు టేబుల్ స్పూన్లు అల్లం రసం,( Ginger juice ) చిటికెడు మిరియాల పొడి, వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి రోజు ఉదయాన్నే తీసుకోండి.
గొంతు నొప్పిని తగ్గించడానికి ఈ వాటర్ చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తాయి.అలాగే జలుబు, దగ్గు వంటి సమస్యలను సైతం దూరం చేస్తాయి.