బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్( Former CM KCR ) ఇప్పటికే రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తో పార్టీ క్యాడర్ చెల్లా చెదురు కావడంతో పెద్ద ఎత్తున గ్రామ , మండల , నియోజకవర్గ , రాష్ట్రస్థాయి నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకోవడం , అలాగే ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు తనకు అత్యంత సన్నిహితంగా మెలిగి, గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించిన వారు ఇప్పుడు కాంగ్రెస్( Congress ) వైపు వెళ్ళిపోతుండడంతో ఈ వలసలకు బ్రేక్ వేసేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పార్టీ క్యాడర్ లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు.ఈ విధంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేసీఆర్ కు మరో షాక్ తగిలింది.

తాజాగా తెలంగాణ మంత్రి సీతక్క( Minister Sitakka ) కెసిఆర్ కు లీగల్ నోటీసులు పంపారు.అయితే ఈ లీగల్ నోటీసులు పంపించడం వెనుక కారణమూ ఉంది .పరోక్షంగా మంత్రి సీతక్కను ఉద్దేశిస్తూ ఇంద్రమ్మ రాజ్యం , ఇసుక, రాళ్ల రాజ్యం అంటూ పార్టీ ట్విట్టర్ అఫీషియల్ హేండిల్ లో బీఆర్ఎస్ పోస్టులు పెట్టింది. ఈ పోస్టులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క బిఆర్ఎస్ అఫీషియల్ అకౌంట్ కావడంతో దానికి బాధ్యుడిగా ఆ పార్టీ అధ్యక్షుడు కేసిఆర్ కు లీగల్ నోటీసులు పంపించారు.

తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు .తన పై నిరాధార ఆరోపణలు చేయడం తగదు అంటూ సూచించారు. తనపై చేసిన తప్పుడు ఆరోపణలకు గాను తక్షణమే కెసిఆర్ క్షమాపణ చెప్పాలని లీగల్ నోటీసుల్లో మంత్రి సీతక్క పేర్కొన్నారు.ఈ నోటీసు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో చర్చిని అంశంగా మారాయి సీతక్క నోటీసులకు కేసిఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.