యూకే ఎన్నికల్లో సిక్కు సంతతి ఎంపీల ప్రభంజనం.. అకల్ తఖ్త్ , ఎస్‌జీపీసీ ప్రశంసలు

ఇటీవల ముగిసిన యూకే సార్వత్రిక ఎన్నికల్లో( UK Elections ) భారతీయులు సత్తా చాటారు.బ్రిటన్ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 28 మంది భారత సంతతి ఎంపీలు హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికయ్యారు.

 Akal Takht Sgpc Hail Election Of British Sikh Mps Details,akal Takht ,sgpc ,of B-TeluguStop.com

అలాగే తన కేబినెట్‌లో భారత మూలాలున్న లిసా నందికి( Lisa Nandy ) కల్చర్, మీడియా, క్రీడా శాఖను అప్పగించారు ప్రధాని కీర్ స్టార్మర్.( PM Keir Starmer ) అన్నింటిలోకి పంజాబీ మూలాలున్న అభ్యర్ధులు (కొందరు సిక్కులు) ఈసారి స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించారు.

రికార్డు స్థాయిలో 12 మంది పంజాబీ సంతతి నేతలు హౌస్ ఆఫ్ కామన్స్‌లో అడుగుపెట్టారు.ఈ సంఖ్య 2019లో ఐదుగా ఉండేది.

గెలుపొందిన 12 మంది ఎంపీలలో ఆరుగురు మహిళలే కావడం విశేషం.వీరిలో 11 మంది లేబర్ పార్టీ ఎంపీలైతే, గగన్ మోహింద్రా( Gagan Mohindra ) కన్జర్వేటివ్ పార్టీకి చెందినవారు.

ప్రీత్‌కౌర్ గిల్, ( Preet Kaur Gill ) సీమా మల్హోత్రా,( Seema Malhotra ) తన్‌మన్‌జీత్ సింగ్ ధేసీలు( Tanmanjeet Singh Dhesi ) సీనియర్ ఎంపీలు.ఈ ముగ్గురి పూర్వీకులు పంజాబ్‌లోని జలంధర్ నగరానికి చెందినవారు.

సీమా ఐదోసారి ఎంపీగా గెలవగా.గిల్, ధేసీలు మూడోసారి విజయం సాధించారు.

Telugu Akal Takht, Gagan Mohindra, Lisa Nandy, Preet Kaur Gill, Seema Malhotra,

హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికైన పంజాబీ సంతతి ఎంపీలు వీరే :

ప్రీత్ కౌర్ గిల్ – బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్
సీమా మల్హోత్రా – ఫెల్తామ్-హెస్టన్
తన్మంజీత్ ధేసీ – స్లౌ
సత్వీర్ కౌర్ – సౌతాంప్టన్
హర్‌ప్రీత్ కౌర్ ఉప్పల్ – హడర్స్‌ఫీల్డ్
సోనియా కుమార్ – డడ్లీ
వారిందర్ జాస్ – వోల్వర్‌హాంప్టన్ వెస్ట్
జాస్ అత్వాల్ – ఇల్ఫోర్డ్ సౌత్
జీవున్ సంధర్ – లౌబరో
కిరిత్ అహ్లువాలియా – బోల్టన్ నార్త్ ఈస్ట్
గురిందర్ సింగ్ జోసన్ – స్మెత్విక్
గగన్ మోహింద్రా – సౌత్ వెస్ట్ హెర్ట్స్

Telugu Akal Takht, Gagan Mohindra, Lisa Nandy, Preet Kaur Gill, Seema Malhotra,

ఈ నేపథ్యంలో యూకే ఎన్నికల్లో గెలుపొందిన సిక్కు ఎంపీలపై సిక్కుల అత్యున్నత నిర్ణాయక విభాగాలైన అకల్ తఖ్త్,( Akal Takht ) శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ)లు ప్రశంసల వర్షం కురిపించాయి.ఐదుగురు మహిళలు సహా తొమ్మిది మంది సిక్కులు బ్రిటీష్ పార్లమెంట్‌లో అడుగుపెట్టడంపై ఈ సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి.అకల్ తఖ్త్ జాతేదర్ గియానీ రఘ్‌బీర్ సింగ్ .బ్రిటన్‌లో నివసిస్తున్న సిక్కులను అభినందించారు.వారి విజయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కు సమాజానికి గర్వకారణమన్నారు.ఎస్‌జీపీసీ ప్రెసిడెంట్ హర్జిందర్ సింగ్ ధామి కూడా బ్రిటీష్ పార్లమెంట్‌కు ఎంపికైన సిక్కులను అభినందించారు.కఠోర శ్రమ, సామర్ధ్యాలతోనే మన సమాజానికి పేరు ప్రఖ్యాతులు వచ్చాయన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube