వైట్‌హౌస్‌కు ఏడాదిగా పార్కిన్సన్ స్పెషలిస్ట్ ఎందుకొస్తున్నట్లు .. అమెరికా రాజకీయాల్లో దుమారం

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఇటీవల జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్ సందర్భంగా డెమొక్రాట్, రిపబ్లికన్ పార్టీల అభ్యర్ధులు అధ్యక్షుడు జో బైడెన్, ( Joe Biden ) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు( Donald Trump ) తలపడ్డారు.ఈ సందర్భంగా బైడెన్‌పై ట్రంప్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించారు.

 White House Visited By Parkinsons Specialist Nine Times Since Last Year Details,-TeluguStop.com

దీంతో బైడెన్ ఎన్నికల బరిలోంచి తప్పుకుని మరొకరికి అవకాశం కల్పించాలని సొంత పార్టీతో పాటు విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.బైడెన్ మానసిక ఆరోగ్యం ఏమాత్రం బాలేదని జాతీయ స్థాయిలో విస్తృతమైన చర్చ జరుగుతోంది.

ఇటీవలికాలంలో జరిగిన కొన్ని ప్రధాన సంఘటనల సందర్భంగా బైడెన్ ప్రవర్తనే ఇందుకు కారణం.

ఈ నేపథ్యంలో ఓ వార్త అమెరికన్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.

గడిచిన ఏడాదిగా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌కు( White House ) తరచూ పార్కిన్సన్స్ నిపుణుడు( Parkinson’s Specialist ) వస్తున్నాడన్నదే ఆ వార్తల సారాంశం.దాదాపు 9 సార్లు సదరు వైద్యుడు వైట్‌హౌస్‌కు వచ్చినట్లుగా తెలుస్తోంది.

జో బైడెన్ శారీరక, మానసిక ఆరోగ్యంపై విమర్శలు వస్తున్న వేళ ఈ వార్తలు డెమొక్రాట్ పార్టీపై మరింత ఒత్తిడిని తీసుకొస్తోంది.న్యూయార్క్ పోస్ట్ ప్రకారం .పార్కిన్సన్స్ వ్యాధిలో స్పెషలిస్ట్ అయిన వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న న్యూరాలజిస్ట్ .బైడెన్‌కు పలుమార్లు పరీక్షలు చేశారట.ఈ ఏడాది జనవరి 17న వైట్‌హౌస్‌ మెడికల్ సెంటర్‌లో న్యూరాలజిస్ట్, డాక్టర్ కెవిన్ ఓ కానర్‌( Dr.Kevin O’Connor ) సహా ఇద్దరు వైద్యులు ఈ భేటీలో ఉన్నట్లుగా న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.

Telugu Donald Trump, Joe Biden, Specialist, Presidential, White-Telugu NRI

అంతేకాకుండా ఆగస్ట్ 2023 నాటికి సదరు న్యూరాలజిస్ట్ వైట్‌హౌస్‌కి 8 సార్లు వచ్చినట్లు విజిటర్స్ రికార్డ్ చెబుతోంది.అగ్రశ్రేణి వైద్య నిపుణుల మధ్య జరిగిన సమావేశంలో వాల్టర్ రీడ్‌కు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ జాన్ ఈ అట్‌వుడ్ కూడా ఉన్నారు.ఈ భేటీలు బహుశా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్యం నిమిత్తం జరిగినవేనని భావిస్తున్నారు.ఈ సమావేశాల వెనుక వైట్‌హౌస్ వైద్యుడు.డాక్టర్ ఓ కానర్ పాత్రపైనా ఆరోపణలు వస్తున్నాయి.

Telugu Donald Trump, Joe Biden, Specialist, Presidential, White-Telugu NRI

అయితే కొద్దిరోజుల క్రితం డాక్టర్ కెవిన్ ఓ కానర్ కీలక వ్యాఖ్యలు చేశారు.జో బైడెన్‌కు ఎలాంటి ‘‘cognitive test’’ అవసరం లేదని తెలిపారు.వాషింగ్టన్ పోస్ట్ నివేదించిన ప్రకారం.

బైడెన్ మూడు వార్షిక శారీరక పరీక్షల వ్యవధితో సహా రాష్ట్రాల అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఆయన ఎలాంటి టెస్టులు చేయించుకోలేదు.వైట్‌హౌస్ అధికారులు కూడా బైడెన్‌కు ‘‘cognitive test’’ చేయమని చెప్పలేదని ఓ కానర్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube