ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా బాగా డెవలప్ అవ్వడంతో బుల్లితెర సెలబ్రిటీ ( Celebrity )నుంచి వెండితెర సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు కూడా వారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు.మరీ ముఖ్యంగా బుల్లితెర సెలబ్రిటీలు కొత్తగా యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసి వారికి తన భర్త పిల్లలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంటారు.
ఈ మధ్యకాలంలో ఇది బాగా ట్రెండ్ అయిపోయింది.

అలా తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు చేరుగా ఉండే బుల్లితెర సెలబ్రిటీలలో నటి లహరి కూడా ఒకరు.తెలుగులో చాలా సీరియల్స్ లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది లహరి( Lahari ).బిజినెస్ లు, యూట్యూబ్ అమౌంట్, షోస్, ఈవెంట్స్, సీరియల్స్, మూవీస్ లో సైడ్ రోల్స్ ఇలా చేస్తూ నాలుగు చేతులా సంపాదిస్తూ బారిగానే డబ్బులు సంపాదిస్తోంది.దాంతో ఎటువంటి చిన్న శుభకార్యమైన సరే గ్రాండ్గా చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను ఎప్పటికప్పుడు యూట్యూబ్ ద్వారా పంచుకుంటూనే ఉంటుంది లహరి.

ఇకపోతే ఇటీవలే ఈమె ఒక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.ఇక అప్పటి నుంచి సీరియల్స్ కు దూరంగా ఉంటూ ఫ్యామిలీతోనే ఎక్కువ సమయాన్ని గడుపుతూ బిజీ బిజీగా ఉంటూ లహరి.లహరి ఇప్పుడు కొన్ని సీరియల్స్ చేస్తోంది.
మరోవైపు యూట్యూబ్ ఛానెల్లోనూ వీడియోస్ చేస్తూ ఉంది. బెంజ్ ఈ-క్లాస్ కారు( Benz E-Class car ) కొనేసింది.
ఇప్పుడు ఆ కార్ ఫొటోలు, వీడియోలని తన ఇన్ స్టాలోనే పోస్ట్ చేసింది.ఆ కారు ధర మార్కెట్లో రూ.80 లక్షలకు పైనే ఉంది.నెటిజన్స్ లహరికి కంగ్రాట్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఈ పిక్స్ లో లహరి ఫ్యామిలీ మొత్తం కనిపిస్తోంది.లహరి భర్త, బిడ్డ, వాళ్ళ పేరెంట్స్, ఫ్రెండ్స్ ఫ్యామిలీ మొత్తం అందరు కూడా ఉన్నారు.