ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్( Viral Videos ) అవుతూనే ఉంటాయి.అందులో తరచుగా ఫన్నీ వీడియోలు, అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవ్వడం చూస్తూనే ఉంటాము.
తాజాగా పాముకు( Snake ) సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.
ఇటీవల కాలంలో పాములు, కొండచిలువలు అడవులను వదిలేసి జనాలు నివసించే ప్రదేశానికి రావడం మనం చూస్తూనే ఉంటాం.
ఈ క్రమంలో ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ లలో, వాహనాలలో, కిచెన్ రూమ్ లలో లేదా ఏసీలలో ఇలా ఎక్కడ పడితే అక్కడ పాములు దర్శనం ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం.ఇక ఇలాంటి వాటికీ సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో( Social Media ) అనేకంగా వైరల్ అవుతూ ఉంటాయి.అయితే తాజాగా ఒక భారీ పాము ఒక మహిళపై ( Woman ) పాకుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక మహిళ గడ్డినేలపై చాప వేసుకుని పడుకొని ఉంది.ఆ సమయంలో ఒక పెద్ద పాము ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.
ఆమె దగ్గరకు వచ్చి ఆ మహిళపై పాకడం మొదలు పెట్టింది.
దీంతో వెంటనే ఆ మహిళ ఒక్కసారిగా ఉలిక్కిపడి పడుకున్న ఆవిడ లేవగా ఒక్కసారిగా పామును చూసి షాక్ కు గురైంది.ఇక ఆ పామును చూసిన ఆ మహిళ వెంటనే అక్కడి నుంచి పరుగులు తీసింది.అయితే పాము ఆ యువతీకి ఎలాంటి హాని కలిగించకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది.
ఇక ఈ వీడియో చూసిన కొంత మంది నెటిజన్స్ ” ఈ వీడియో ఫేక్ అని ” కామెంట్ చేస్తూ ఉంటే.మరికొందరు అయితే ” ఆ పాము విషపూరితమైనది కాదు ” అంటూ కామెంట్ చేశారు.