తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ సాయి పల్లవి( Heroine Sai Pallavi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సాయి పల్లవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి విజయాలను అందుకుంటూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.ప్రస్తుతం ఈమె నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండేల్( Tandel ) సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఇకపోతే ప్రస్తుతం ఒకవైపు హీరోయిన్ గా చేస్తూనే మరొకవైపు డాక్టర్ చదువుతున్న విషయం తెలిసిందే.అయితే సాయి పల్లవి సినిమాల కంటే ముందు నుంచి మెడిసిన్ చదువుతున్న సంగతి తెలిసిందే.

సినిమాల్లోకి వచ్చాక కూడా సాయి పల్లవి మెడిసిన్ చదివింది.కొన్నాళ్ల క్రితమే సాయి పల్లవి మెడిసిన్ పూర్తి చేసిందని, త్వరలోనే హాస్పిటల్ కూడా కట్టబోతుందని ఇటీవల వార్తలు వచ్చాయి.సాయి పల్లవి జార్జియా దేశంలోని Tbilisi స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ( Tbilisi State Medical University in Georgia )నుంచి మెడిసిన్ చేసిందట.ఇటీవల సాయి పల్లవి రెండు రోజుల క్రితం జార్జియా వెళ్లి తాను చదివిన యూనివర్సిటీలో MBBS గ్రాడ్యుయేషన్ పట్టా పుచ్చుకొని వచ్చింది.
గ్రాడ్యుయేషన్ డే రోజు తన కాలేజీలో ఫ్రెండ్స్ తో సరదాగా గడిపింది.దీంతో అక్కడ సాయి పల్లవి గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇపుడు సాయి పల్లవి కాదు డాక్టర్ సాయి పల్లవి అనాలి అని అంటున్నారు అభిమానులు.మరి సాయి పల్లవి ఫ్యూచర్ లో హాస్పిటల్ కడుతుందా, డాక్టర్ గా పనిచేస్తుందా, అలాగే నటిగా కెరియర్ ని కొనసాగిస్తుందా ఈ విషయాలన్నీ తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.అలాగే సాయి పల్లవి డాక్టర్ పట్టాను పుచ్చుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.