మీరు ఐస్ క్రీమ్ ప్రియులా.. రెగ్యులర్ గా తింటారా.. అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి!

ఐస్ క్రీమ్( Ice Cream ) అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే ఫుడ్స్ లో ఐస్ క్రీమ్ ముందు వరుసలో ఉంటుంది.

 Side Effects Of Eating Ice Cream Daily Details! Ice Cream Side Effects, Ice Crea-TeluguStop.com

అందులోనూ ప్రస్తుత సమ్మర్ సీజన్ లో ఐస్ క్రీమ్స్ ను తెగ లాగించేస్తుంటారు.ఇక సీజన్ తో పని లేకుండా రెగ్యులర్ గా తినేవారు కూడా ఉంటారు.

ఇలాంటి వారు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే విషయాలు తెలుసుకోవాలి.ఎంత ఐస్ క్రీమ్ ప్రియులైన సరే రెగ్యులర్ గా తింటే మాత్రం అనేక అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లే అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఐస్ క్రీమ్ టేస్ట్ గా ఉంటుంది.కానీ ఎన్నో సమస్యలను మోసుకొస్తుంది.ఐస్ క్రీమ్స్ లో కొవ్వు, క్యాలరీలు, షుగర్స్ చాలా అధిక మొత్తంలో ఉంటాయి.ఇది మన ఆరోగ్యాన్ని తీవ్రంగా పాడు చేస్తాయి.

రెగ్యులర్గా ఐస్ క్రీమ్ తీసుకుంటే శరీర బరువు అదుపు తప్పుతుంది.బాడీలో క్యాలరీలు భారీగా పెరిగిపోతాయి.

దాంతో ఊబకాయం ( Obesity ) బారిన పడే అవకాశాలు రెట్టింపు అవుతాయి.

Telugu Cholestrol, Diabetes, Tips, Heart Attack, Cream, Cream Lovers, Cream Effe

అలాగే నిత్యం ఐస్ క్రీమ్ ను తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది.ఇది ధమనుల్లో అడ్డంకిని కలిగిస్తుంది.ఫలితంగా గుండెపోటు తో( Heart Attack ) సహా తదితర గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

మీరు రోజూ ఐస్ క్రీమ్ ను తింటూ ఉంటే పాతిక ముప్పై ఏళ్లకే మధుమేహం( Diabetes ) బారిన పడతారు.దాంతో ఐస్ క్రీమ్ తో సహా మరే స్వీట్స్ ను తినలేరు.

ప్రతిరోజు ఐస్ క్రీమ్ ను లాగించేస్తే దంతాలు చిగుళ్ల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది.

Telugu Cholestrol, Diabetes, Tips, Heart Attack, Cream, Cream Lovers, Cream Effe

దంతాలు పుచ్చిపోవడం లేదా బలహీనంగా మార‌డం, చిగుళ్ల వాపు, చిగుళ్ళ నుంచి రక్తస్రావం తదితర సమస్యలన్నీ తలెత్తుతాయి.రెగ్యులర్ గా ఐస్ క్రీమ్ ను తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మంద‌గిస్తుంది.జ్ఞాపకశక్తి, ఆలోచన శక్తి క్రమంగా తగ్గిపోతాయి.

బద్దకం పెరిగిపోతుంది.బెల్లీ ఫ్యాట్ సమస్య ఏర్పడుతుంది.

చర్మంపై మొటిమలు సైతం ఎక్కువగా వస్తుంటాయి.కాబట్టి ఎంత ఐస్ క్రీమ్ ప్రియులైన సరే రెగ్యులర్ గా తింటే మాత్రం మీ ఆరోగ్యాన్ని మీరే చేతులారా పాడు చేసుకున్న వారు అవుతారు.

కాబట్టి వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి మాత్రమే ఐస్ క్రీమ్ ను తీసుకునేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube