వైజయంతి మూవీస్… కల్కి సినిమా విజయం సాధించిన తర్వాత చాలామంది ఈ బ్యానర్ గురించి మాట్లాడుకుంటున్నారు.చాలా ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఇన్నేళ్ల పాటు రాని పేరు ప్రతిష్ట ఈ ఒక్క సినిమాతో వచ్చింది.
ప్రస్తుతం కల్కి సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ దిశగా పరుగులు పెడుతున్న ఈ సందర్భంలో ఇప్పటివరకు వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఎంతో మంది నటినటులను తెలుగు తెరకు పరిచయం చేశారు.అయితే అందులో ప్రముఖంగా ఉన్న కొంత మంది గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మహేష్ బాబు
( Mahesh Babu )
రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై మహేష్ బాబుని రాజకుమారుడు ( Rajakumarudu )అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేశారు.ఇలాంటి ఒక స్టార్ హీరో ప్రస్తుతం ఇండస్ట్రీలో అతి తక్కువ మంది ఉన్నారు ఇంత గొప్ప స్టార్ ను పరిచయం చేసిన ఘనత వైజయంతి వారికే దక్కింది.
అల్లు అర్జున్
( Allu Arjun )
మరో మరో రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి( Gangotri ) అనే సినిమాతో వైజయంతి మూవీస్ బ్యానర్ పైనే అల్లు అర్జున్ ని తెలుగు తెరకు పరిచయం చేశారు.గీత ఆర్ట్స్ లాంటి ఒక బ్యానర్ ఉన్నప్పటికీ వైజయంతి మూవీస్ మాత్రమే సరైన నిర్మాణ సంస్థగా భావించి అప్పట్లో ఈ లాంచింగ్ జరిగింది.
నందమూరి తారకరత్న
( Nandamuri Tarakaratna )
నందమూరి వారసుడు మూడోతరం నటుడు ఆయన తారక రత్నను వైజయంతి మూవీస్ బ్యానర్ పైనే ఒకటో నెంబర్ కుర్రాడు( Number one kurradu ) అనే సినిమాతో లాంచ్ చేయడం జరిగింది.ఈ చిత్రాన్ని కూడా రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడం విశేషం.
నారా రోహిత్
( Nara Rohith )
నారా వారింటి అబ్బాయి అలాగే మంచి నటుడు అన్న పేరున్న రోహిత్ ని బాణం సినిమాతో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్తు కుమార్తె అయిన స్వప్న లాంచ్ చేయడం జరిగింది.
విజయ్ దేవరకొండ
( Vijay Devarakonda )
ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో విజయ్ దేవరకొండను అలాగే మాళవిక నాయర్ ను తెలుగు తెరకు పరిచయం చేశారు వైజయంతి మూవీస్ వారు.
దుల్కర్ సల్మాన్
( Dulquer Salmaan )
2011 నుంచి దుల్కర్ మలయాళ సినిమా ఇండస్ట్రీ అలాగే తమిళ సినిమా ఇండస్ట్రీలో పాపులర్ స్టార్ హీరోగా కొనసాగుతున్నప్పటికీ తెలుగులో మాత్రం మహానటి సినిమాతోనే వైజయంతి మూవీస్ ఆయనను పరిచయం చేయడం జరిగింది.
మృణాల్ ఠాకూర్
( Mrinal Thakur )
సీతారామం అంటే ఒక క్లాసిక్ సినిమాతో బాలీవుడ్ నటి అయిన మృణాళ్ ఠాకూర్ ని తెలుగు పరిశ్రమకు పరిచయం చేశారు వైజయంతి వారు ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించడం విశేషం.