మోడరేట్ డ్రింకింగ్ ఈజ్ బెనిఫీషియల్ టూ హెల్త్ అంటూ డాక్టర్లు చెబుతుంటారు.అంటే మద్యం ఓ లిమిట్ గా, రోజుకి మినిమమ్ ఎమౌంట్ మాత్రమే తీసుకుంటే అది శరీరానికి ఎంతో మేలు చేస్తుందని, ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి చాలా మంచిదని చదువుకున్నాం.
కాని ఇది కేవలం మగవారికే లాభాకరమని ఇకనుంచి చెప్పాలేమో, ఎందుకంటే ఆడవారు మోడరేట్ గా డ్రింక్ చేసినా కూడా ప్రమాదమే అంటున్నారు భారత సంతతికి చెందిన అమెరికా శాస్త్రవేత్తలు.స్త్రీలు రోజుకో డ్రింక్ అంటూ ఎంత కంట్రోల్డ్ గా మద్యం సేవించినా, అది వారి ఆరోగ్యానికి చేటే అని, మద్యం అలవాటు ఎంత తక్కువ ఉన్నా అది రొమ్ము క్యాన్సర్ కి కారణమవుతుందని అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చి వారు తెలిపారు.
ఈ రీసెర్చిలో తేలిందేంటంటే, రోజుకి 10 గ్రాముల ఆల్కాహాల్ స్త్రీ శరీరంలో పడినా, అది రొమ్ము క్యాన్సర్ కి దారి ఇవ్వొచ్చు అంట.ఇలా ఎందుకు అంటే మద్యం జీన్స్ మూట్వేషన్ కి కారణం అవుతుంది.మద్యం జీన్స్ ని దెబ్బతీసి, DNA Mutuation ని ప్రోత్సాహిస్తుంది.ఇది DNA కి మంచిది కాదు.
“మేం చేసిన కొన్నిరకాల పరీక్షలలో తేలినదేమిటంటే, మద్యం శరీరంలో క్యాన్సర్ సెల్స్ ని పెంచి పోషిస్తుంది.మెనోపాజ్ దాకా రాని మహిళ అయినా, మెనోపాజ్ దాటిన మహిళ అయినా, ఎవరైనా సరే, మద్యం మూలాన శరీరంలో ఓస్ట్రోజెన్ లెవెల్స్ పెరగడాన్ని చూస్తారు.
దీంతో రొమ్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది” అన్నారు ఒంకోలాజిస్ట్ భరత్ షా.
మరో డాక్టర్ టీఎస్ రావు మాట్లాడుతూ “రొమ్ము క్యాన్సర్ కి చాలా కారణాలు ఉంటాయి.అధికబరువు, శారీరక శ్రమ లేకపోవడం, పీరియడ్స్ లో సమస్యలు, అనారోగ్యకరమైన లైఫ్ స్టయిల్ లేదంటే రొమ్ములలో బాగా కొవ్వు పెరగటం కావచ్చు, ఇలా పలురకాల కారణాలుంటాయి.ఇవన్ని అప్పటికే స్త్రీ స్తనాలపై దాడికి సహకరిస్తోంటే, మద్యం మరో చేయి వేస్తుంది.
మద్యం అలవాటు లేని మహిళలకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువే అని మా పరిశోధనలు చెబుతున్నాయి” అంటూ చెప్పుకొచ్చారు.
కాబట్టి, రోజుకో డ్రింక్ అని సరదాపడే మహానగరాల అమ్మాయిలు, కొంచెం జాగ్రత్తగా ఉండండి.
ఎందుకంటే ఈ రొమ్ము క్యాన్సర్ మహమ్మారి మనదేశంలోనే ఏడాదికి లక్షలమందిని ఇబ్బందిపెడుతోంది, వేలమంది ప్రాణాలు తీసుకుంటోంది.