Skin Care Tips: మొటిమలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి?

యువతీయువకుల్లో చాలా మంది కామన్ గా ఫేస్ చేసే సమస్య మొటిమలు.చర్మంపై మొటిమలు( Acne ) తలెత్తడానికి కారణాలు అనేకం.

 Follow This Remedy To Say Goodbye Acne Forever Skin-TeluguStop.com

మృత కణాలు పేరుకుపోవడం, దుమ్ము ధూళికి ఎక్కువగా బహిర్గతం కావడం, ఆయిల్ స్కిన్, అతిగా ఫోన్ మాట్లాడడం, ఆహారపు అలవాట్లు, హార్మోన్ ప్రభావం తదితర కారణాల వల్ల మొటిమలు తలెత్తుతుంటాయి.ముఖంపై మొటిమలు చూడగానే తీవ్ర ఆందోళనకు లోనవుతుంటారు.

వాటిని కవర్ చేసుకునేందుకు ముప్ప‌ తిప్పలు పడుతుంటారు.అలాగే మొటిమలను త్వరగా పోగొట్టుకోవడం కోసం కెమికల్ క్రీమ్స్ వాడుతుంటారు.

కానీ అటువంటి క్రీమ్స్ చర్మ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి.అందుకే సహజంగానే మొటిమలను వదిలించుకోవడానికి ప్రయత్నించాలి.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే హోమ్ రెమెడీ మొటిమ‌ల‌ను న్యాచుర‌ల్‌గానే మాయం చేస్తుంది.ఈ రెమెడీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్( Green tea powder ) వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ ములేటి పౌడర్, వన్ టేబుల్ స్పూన్ శనగపిండి మరియు సరిపడా వాటర్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Acne, Acne Skin, Tips, Clear Skin, Remedy, Latest, Pimples, Skin Care, Sk

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం మొత్తానికి అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ములేటి పౌడర్, గ్రీన్ టీ మరియు శనగపిండి( Gram flour )లో ఉండే పలు సుగుణాలు మొటిమలకు వ్యతిరేకంగా పోరాడతాయి.

చాలా తొందరగా మొటిమల‌ను నివారిస్తాయి.అలాగే చర్మం పై పేరుకుపోయిన మృత కణాలను తొలగిస్తాయి.

చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తాయి.అధిక ఆయిల్ ఉత్పత్తిని సైతం కంట్రోల్ చేస్తాయి.

ఈ సింపుల్ రెమెడీని పాటించడం ద్వారా మొటిమల సమస్యను సులభంగా వదిలించుకోవచ్చు.మొటిమల తాలూకు మచ్చలు ఉన్నా కూడా మాయమవుతాయి.

Telugu Acne, Acne Skin, Tips, Clear Skin, Remedy, Latest, Pimples, Skin Care, Sk

ఇక మొటిమలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పాలనుకుంటే ఈ రెమెడీని తరచుగా పాటించడంతో పాటు మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.ముఖ్యంగా పోషకాలతో కూడిన ఆహారాన్ని డైట్ లో చేర్చుకోవాలి.జంక్ ఫుడ్‌, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.ధూమ‌పానం, మ‌ద్య‌పానం అలవాట్లను వదులుకోవాలి.అతిగా ఫోన్ మాట్లాడడం తగ్గించాలి.నిత్యం అరగంటైనా వ్యాయామం చేయాలి.

శరీరానికి అవసరమయ్యే నీటిని అందించాలి.మరియు చర్మానికి నిత్యం మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా స్కిన్‌ హెల్తీగా మారుతుంది.మొటిమ‌ల‌తో స‌హా అనేక చ‌ర్మ స‌మ‌స్య‌లు వేధించ‌కుండా ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube