ఎయిర్ హోస్టెస్‌కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ప్యాసింజర్.. ఆమె రియాక్షన్ చూస్తే..?

ఇటీవల ఇండిగో విమానం( IndiGo )లో జరిగిన ఒక హార్ట్ టచ్చింగ్ ఇన్సిడెంట్ ప్రయాణికులు, నెటిజన్ల మనస్సులను గెలుచుకుంది.ఆ విమానంలో, ఒక ఆర్టిస్ట్ విమానయాన సిబ్బందిలో ఒక ఎయిర్ హోస్టెస్‌ చిత్రాన్ని గీయాలని నిర్ణయించుకుంది.

 The Passenger Who Gave An Amazing Gift To The Air Hostess.. If You See Her React-TeluguStop.com

లేడీ ఆర్టిస్ట్ పని చూసి ఎయిర్ హోస్టెస్‌ పొగిడింది.అయితే తనకు మంచి మాటలు చెప్పి మనసును సంతోషపరిచినందుకు ఆ ఆర్టిస్ట్ కూడా ఎయిర్ హోస్టె( IndiGo Air Hostess )స్‌ కృషి చేయాలనుకుంది.

అంతే ఆమె తనదైన శైలిలో ఆమెకు సర్‌ప్రైజ్ ఇచ్చింది.

అసలు ఏం జరిగిందో తెలుసుకుంటే, విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక లేడీ ఆర్టిస్టు తన ఆర్ట్‌పై పనిచేస్తోంది.ఆమె ప్రతిభను ఒక చురుకైన ఎయిర్ హోస్టెస్ గమనించింది.కళాకారిణి నైపుణ్యాలకు ముగ్ధులైన హోస్టెస్ ఆమెను ప్రశంసించింది.

హోస్టెస్ ప్రశంసలకు స్పందించి, కళాకారిణి ఆమె కోసం ప్రత్యేకంగా ఒక కార్టూన్ పాత్ర స్కెచ్ ను గీయాలని నిర్ణయించుకుంది.ఇది కళాకారిణికి ఒక కొత్త అనుభవం, ఎందుకంటే ఆమె ఇంతకు ముందు ఇలాంటి పని చేయలేదు.

ఫ్లైట్ అటెండెంట్ ఆ స్కెచ్ ను తనకోసం గీసినందుకు బహుమానంగా కళాకారిణిని ఆశ్చర్యపరిచింది.ఆమె ఆమెకు వివిధ రకాల స్నాక్స్, చేతితో రాసిన నోట్ ను అందించింది.అంత మంచిగా చూసుకున్నందుకు కళాకారిణి ముగ్ధురాలైంది.వీరి మధ్య చోటు చేసుకున్న ఆ హార్ట్ టచింగ్ ఇన్సిడెంట్ వీడియోను కళాకారిణి సుమౌలి దత్తా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.

ఆ పోస్ట్‌లో అపరిచితులతో తన కళను పంచుకునేటప్పుడు తనకు చాలా సిగ్గుగా ఉంటుందని ఆమె చెప్పింది.అయితే, హోస్టెస్ ప్రశంసలు ఆమెకు ధైర్యాన్నిచ్చాయి.సోషల్ మీడియా ( Social media)యూజర్లు ఈ వీడియో పై పాజిటివ్ కామెంట్ల వర్షం కురిపించారు.కొందరు ఆర్టిస్ట్ తన స్కెచ్‌లను పంచుకోవడం కొనసాగించాలని ప్రోత్సహించారు, మరికొందరు ఎయిర్ హోస్టెస్‌ల దయను ప్రశంసించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube