అక్క పాత్రకు భారీ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న నయన్.. ఆమెకు తిరుగులేదంటూ?

తెలుగు ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ నయనతార( Nayanthara ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నయనతార ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.

 Huge Remuneration To Nayanthara For Sister Role Details, Nayanthara Remuneration-TeluguStop.com

ఒకవైపు హీరోయిన్గా సినిమాలు చేస్తూనే నిర్మాతగా కూడా మారి సినిమాలను నిర్మిస్తోంది.నయనతార దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.

అంతే కాదు హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకుపోతోంది.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ లలో టాప్ జాబితాలో ఈమె కూడా ఒకరు.ఇది ఇలా ఉంటే తాజాగా నయనతార సినిమాలో అక్క పాత్రలో( Sister Role ) నటించడానికి భారీగా రెమ్యునరేషన్‌ ను డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.నయనతార ప్రధాన పాత్రలో నటించిన మన్నాంగట్టి సిన్స్‌ 1960 అనే చిత్రం షూటింగ్‌ ఇటీవలే పూర్తి చేసుకుంది.

ఈ సినిమా తర్వాత నవీన్‌ పాలితో కలిసి డియర్‌ స్టూడెంట్స్‌( Dear Students ) అనే చిత్రంలో నటిస్తున్నారు.అలాగే ఒక కన్నడ మూవీలో కూడా ఆమె నటిస్తున్నారు.

ఇందులో అక్క పాత్రను ఆమె పోషిస్తున్నారు.

అయినప్పటికీ తన రెమ్యునరేషన్‌ తగ్గించుకునేందుకు ససేమిరా అన్నారట.పైగా తాను తీసుకునే పారితోషికం కంటే అధికంగానే రెమ్యునరేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారట.నయనతారకు ప్రస్తుతం ఉన్న ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఆమె అడిగినంత రెమ్యూనరేషన్( Nayanthara Remuneration ) ఇవ్వడానికి మేకర్స్ ఓకే చెప్పారనేలా టాక్ వినబడుతోంది.

ఈ విషయం గురించే ప్రతి ఒక్కరూ కూడా చర్చించుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube