చైనా( China ) ప్రజలు చేసే పనులు మిగతా ప్రపంచానికి ఎప్పుడూ కొత్తగా అనిపిస్తుంటాయి.వారి ఆలోచన విధానం చాలా భిన్నంగా ఉంటుంది.
ఎవరూ ఊహించని, సాధ్యమవుతుందని భావించని వాటిని వారు సుసాధ్యం చేసి చూపిస్తుంటారు.తాజాగా చైనాకు చెందిన ఓ కళాకారుడు ఇదే విషయాన్ని మరోసారి నిరూపించాడు.కై గువో-కియాంగ్ అని పిలిచే చైనీస్ ఆర్టిస్ట్ ప్రత్యేకమైన ఫైర్ లేదా ఎక్స్‌ప్లోజివ్ ఆర్ట్‌తో సూపర్ పాపులర్ అయ్యాడు.2008 బీజింగ్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో 100 కోట్ల మంది ప్రజలు అతని కళాఖండాన్ని చూశారు.ఒకేసారి ఇంత మంది ప్రేక్షకులను చేరుకున్న మొదటి కళాకారుడు అతనే కావచ్చు.

తన అమ్మమ్మ 100వ జన్మదినం సందర్భంగా కై గువో-కియాంగ్ “స్కై ల్యాడర్( Sky Ladder )” అనే ప్రత్యేక కళాఖండాన్ని సృష్టించాడు.ఎల్లప్పుడూ కళాకారుడిగా మారాలనే తన కలకు ఈ కళాఖండంతో నివాళి అర్పించాడు.“స్కై ల్యాడర్” ఒక భారీ బాణసంచా ప్రదర్శన, ఇది ఆకాశానికి లేదా స్వర్గానికి చేరుకునే ఒక నిచ్చెనలా లేదా మెట్ల లాగా కనిపిస్తుంది.ఇది 1,650 అడుగుల ఎత్తు ఉంది.రాగి తీగకు అమర్చిన ఫైర్ వర్క్స్‌తో తయారైంది.కై గువో-కియాంగ్ ఒక హాట్ ఎయిర్ బలూన్లో ఉన్నప్పుడు “స్కై ల్యాడర్”ను వెలిగించాడు.హుయియు ద్వీపం సమీపంలో ఉన్న ఒక పడవ నుంచి బలూన్ను ప్రయోగించాడు.

కై గువో-కియాంగ్ సృష్టించిన “స్కై ల్యాడర్” ఆర్ట్ బాగా విజయవంతమైంది.దీనిని 20 లక్షలకు పైగా ప్రజలు సోషల్ మీడియా( Social media)లో దీనిని షేర్ చేసుకున్నారు, చూశారు.చాలా మంది దాని సృజనాత్మకతను ప్రశంసించారు.ఈ ఆర్ట్ ఓ నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీని కూడా రూపొందించేలా ప్రేరేపించింది.కై గువో-కియాంగ్ గతంలో కూడా “స్కై ల్యాడర్”ను సృష్టించడానికి ప్రయత్నించాడు.1994లో అతని మొదటి ప్రయత్నం బలమైన గాలుల వల్ల ఆగిపోయింది.2001లో, 9/11 దాడుల తరువాత, షాంఘై( Shanghai ) అధికారులు దీనిని అనుమతించలేదు.చివరగా, 2015 జూన్ 15న, చైనా ఫుజియాన్ ప్రావిన్స్‌లోని ఆగ్నేయ ప్రాంతంలోని క్వాంజౌ నగరంలో అతను విజయం సాధించాడు.
ఈ ప్రదర్శన 80 సెకన్ల పాటు కొనసాగింది.







