చిరు నో చెబితే బాలయ్యకు ఇండస్ట్రీ హిట్.. ఆ బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?

ఇండస్ట్రీలో మామూలుగా ఒక హీరో హీరోయిన్ రిజెక్ట్ చేస్తున్న సినిమాను మరొక హీరో హీరోయిన్లు చేసి మంచి సక్సెస్ ను అందుకోవడం లేదంటే ఫ్లాప్ ను అందుకోవడం అన్నది కామన్.ఇలా ఇప్పటికే ఎంతో మంది హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాను మరొక హీరోలు చేసి మంచి సక్సెస్ అందుకున్న వారు అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి.

 Latest News About Mangamma Gari Manavadu Movie Details, Mangamma Gari Manavadu,-TeluguStop.com

చాలా మంది హీరోలు తమ వద్దకు వచ్చిన కథల్లో ఎక్కువ శాతం తిరస్కరిస్తూ ఉంటారు.కొందరు ఇంకా కొన్ని కారణాల వల్ల కూడా రిజెక్ట్ చేస్తూ ఉంటారు.

అయితే ఎక్కువ శాతం ప్రాజెక్ట్‌ లను కథలు నచ్చక పోవడం వల్ల తిరస్కరిస్తూ ఉంటారు.

ప్రస్తుత యంగ్‌ హీరోలను మొదలుకుని అప్పటీ హీరోలు ఎన్టీఆర్‌ ల వరకు కూడా ఎంతో మంది ఎన్నో ప్రాజెక్ట్‌ లను వదిలేసిన విషయం తెల్సిందే.అలాగే మెగాస్టార్‌ చిరంజీవి( Megastar Chiranjeevi ) కూడా ఒక కథకు నో చెప్పడం, ఆ కథకు బాలయ్య( Balayya ) ఓకే చెప్పడం సూపర్‌ హిట్‌ దక్కించుకోవడం జరిగిందట.ఇంతకీ ఆ సినిమా ఏది? చిరు ఎందుకు నో చెప్పారు అన్న వివరాల్లోకి వెళితే.కోడి రామకృష్ణ( Kodi Ramakrishna ) ఒక మంచి కథను చిరంజీవికి వినిపించగా, పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ సినిమాలకు తాను సెట్ అవ్వలేనేమో అన్న ఉద్దేశంతో చిరంజీవి ఆ సినిమాను రిజెక్ట్ చేశారట.

చిరంజీవి నో చెప్పిన అదే కథ ను దర్శకుడు కోడి రామకృష్ణ కొన్నాళ్ల తర్వాత బాలకృష్ణ వద్దకు వెళ్లాడు.బాలయ్య ఆ కథ కు ఓకే చెప్పాడు.అదే మంగమ్మగారి మనవడు.

( Mangamma Gari Manavadu ) కథకు ఓకే చెప్పిన వెంటనే సినిమా ప్రారంభం అవ్వడం, విడుదల అవ్వడం, సూపర్‌ హిట్‌ అవ్వడం ఇలా అన్ని స్పీడ్‌ గా జరిగిపోయాయట.ఒకవేళ చిరంజీవి గనుక ఆ సినిమాను చేసి ఉంటే ఆయన క్రేజ్ మరోలా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube