రైతులకు సరిపడా పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు( Thummala Nageswara Rao ) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.ఖరీఫ్ లో దాదాపు 60.53 లక్షల పత్తి సాగయ్యే అవకాశం ఉందని తెలిపారు.
గతేడాది 90 లక్షల ప్యాకెట్ల పత్తి విత్తనాలు( Cotton seeds ) అమ్ముడయ్యాయని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
ఈ సారి 120 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లను మార్కెట్ లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.డీలర్లు ఎక్కువ ధరకు పత్తి విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
విత్తన సరఫరాలో కంపెనీలు ఇబ్బందులు కలిగిస్తే ఉపేక్షించమని స్పష్టం చేశారు.అలాగే విధుల పట్ల అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.