జబర్దస్త్ లో రెమ్యూనరేషన్ తక్కువే.. కోట్లలో ఆస్తులు అదిరే అభి కామెంట్స్ వైరల్!

జబర్దస్త్ ( Jabardadth ) కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్లు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో సక్సెస్ అయినటువంటి కమెడియన్స్ అందరూ కూడా ప్రస్తుతం సినిమా అవకాశాలు అందుకోవడం హీరోలుగా డైరెక్టర్లుగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

 Adire Abhi Sensational Comments On Jabardasth Comedians And Their Assets ,jabard-TeluguStop.com

ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగే వారందరికీ కూడా చాలా తక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్( Remuneration ) ఇస్తారనే సంగతి తెలిసిందే.

Telugu Adire Abhi, Adireabhi, Assets, Comedians, Jabardasth-Movie

ఇలా తమ రెమ్యూనరేషన్ గురించి పలు సందర్భాలలో జబర్దస్త్ కమెడియన్స్ బయటపెట్టారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో పనిచేసే వారందరికీ రెమ్యూనరేషన్ తక్కువ అయినప్పటికీ ఆస్తులు మాత్రం కోట్లలో సంపాదించారని తెలుస్తోంది  అసలు ఇదేలా సాధ్యం అంటూ తాజాగా జబర్దస్త్ మాజీ కమెడియన్ అదిరే అభి( Adire Abhi ) కి ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న ఎదురయింది.ఈ ప్రశ్నకు అదిరే అభి చేస్తున్నటువంటి కామెంట్స్ సంచలనంగా మారింది.

Telugu Adire Abhi, Adireabhi, Assets, Comedians, Jabardasth-Movie

జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేసే కమెడియన్లకు రెమ్యూనరేషన్ తక్కువ అయినప్పటికీ ఆస్తులు మాత్రం కోట్లలో సంపాదించారు అనేది కరెక్ట్ కాదని తెలిపారు.నేను ఈ కార్యక్రమానికి రాకముందు నాకు సొంత ఇల్లు ఉంది కారు ఉంది అలాగే నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడిని.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా గుర్తింపు సంపాదించుకొని వారందరూ కూడా ఇతర కార్యక్రమాలలో అవకాశాలు అందుకుంటూ రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడుతున్నారు.అలా కష్టపడి వారి ఆస్తులను సంపాదించుకున్నారని కేవలం జబర్దస్త్ రెమ్యూనరేషన్ ద్వారా కోట్లలో ఆస్తులు సంపాదించడం లేదంటూ అభి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతున్నటువంటి పలువురు ఇప్పటికే హైదరాబాదులో సొంత ఇండ్లతో పాటు భారీ స్థాయిలో ఆస్తులను కూడా సంపాదించుకున్నారు.ఇక పలువురు హీరోలుగా దర్శకులుగా కూడా ఎంతో మంచి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube