మా వాడైన పరాయి వాడే... సంచలనం రేపుతున్న నాగబాబు కామెంట్స్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.అయితే గత కొద్ది రోజులుగా మెగా ఫ్యామిలీ( Mega family ) కి అలాగే అల్లు ఫ్యామిలీకి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

 Nagababu Indirectly Counter To Allu Arjun On Ap Elections, Allu Arjun,nagababu,-TeluguStop.com

కానీ తమ కుటుంబాల మధ్య ఏ విధమైనటువంటి విభేదాలు లేవని పైకి చెబుతున్నారు అయితే ఇటీవల ఏపీ ఎన్నికలు ( AP Elections ) జరిగినటువంటి తరుణంలో మెగా ఫ్యామిలీ అలాగే వాళ్ళు ఫ్యామిలీ మధ్య ఉన్నటువంటి విభేదాలు మరోసారి బయటపడ్డాయని తెలుస్తుంది.

మెగా హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పిఠాపురం ( Pitapuram ) నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు.

అయితే మెగా ఫ్యామిలీ అంతా కూడా ఆయనకి మద్దతు తెలిపారు.ఇక అల్లు అర్జున్ ( Allu Arjun ) కూడా సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపిన ఈయన మాత్రం నేరుగా వైఎస్ఆర్సిపి పార్టీకి ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించారు దీంతో మెగా అభిమానులు అలాగే మెగా హీరోలు కూడా బన్నీపై పరోక్షంగా ట్రోల్స్ చేస్తున్నారు.

అల్లు అర్జున్ తన స్నేహితుడు నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవికి మద్దతు తెలియజేస్తూ నంద్యాలలో పర్యటించిన సంగతి తెలిసిందే.ఈ పర్యటన గురించి అల్లు అర్జున్ క్లారిటీ కూడా ఇచ్చారు.నాకు పార్టీలతో సంబంధం లేదు నా స్నేహితుడు కనుక నేను సపోర్ట్ చేశానని తెలిపారు.కానీ నాగబాబు తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ చూస్తే రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తుంది.

సోషల్ మీడియా వేదికగా నాగబాబు స్పందిస్తూ.మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మా వాడు అయిన పరాయి వాడే.మాతో నిలబడే వాడు పరాయివాడైన మా వాడే అంటూ నాగబాబు ఎక్కడ బన్నీ పేరు ప్రస్తావనకు తీసుకురాకుండా ఈ పోస్ట్ చేయడంతో ఈయన అల్లు అర్జున్ కి కౌంటర్ ఇస్తూ ఈ పోస్ట్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.మరి నాగబాబు చేసిన ఈ పోస్టుపై బన్నీ ఫాన్స్ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube