ప్రస్తుత కాలంలో వాలు జడ ప్రతి ఆడపిల్లకు ఒక కలగా మిగిలిపోతూ ఉంది.పోషకాహార లోపం, వాయు కాలుష్యం, హార్మోన్ల లోపం ఇలా రకరకాల కారణాలతో ఒత్తైన వాలు జడ కలగానే మారిపోయింది.
మన పెద్ద వారి కాలంలో జుట్టుకు కొబ్బరి నూనె, తల స్నానానికి కుంకుడుకాయలు ఉపయోగించేవారు.అప్పట్లో ఇన్ని రకాల హెయిర్ ఆయిల్స్ రసాయనాలతో కూడిన షాంపులు లేవు.
అంతా నేచురల్ గానే ఉండేది.కాబట్టి అప్పటి ఆడపిల్లలకు పొడవైన ఒత్తయిన జడలు ఉండేవి.
కానీ ప్రస్తుత కాలంలో నేచురాలిటీ కంటే సువాసన వచ్చే ఆయిల్, షాంపూల వైపు మోగ్గుచూపుతున్నారు.

స్కాల్ప్ పై చుండ్రు లేదా తెల్లటి పొర లాంటిది పేరుకుపోయి జుట్టు పెరగడం ఆగిపోవడమే కాకుండా ఉన్నది కూడా ఊడిపోతుంది.అయితే ఇంట్లోనే ఒక చక్కని చిట్కా ను అది కూడా మనకు అందుబాటులో ఉండే కలబందతో ( Aloe Vera )పాటిస్తే జుట్టు సంబంధిత సమస్యలు దూరమై వెంట్రుకలు బాగా పెరుగుతాయి.ఆ చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే మొదటిగా రెండు టీ స్పూన్ల బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి.ఒక గ్లాసు నీటిలో టీ పొడి వేసి డికాషన్ లా కాచుకొని వడగట్టుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక మిక్స్ జార్ లో ఒక కప్పు కలబంద గుజ్జు నాలుగు మందార పువ్వులు( Hibiscus Flower ) వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి.

ఇందులో బియ్యాన్ని నానబెట్టి ఉంచిన నీటిలో నాలుగు టీ స్పూన్లు తీసుకోవాలి.అలాగే నాలుగు టీ స్పూన్ల డికాషన్ ఆముదం( Castor ) వేసి బాగా కలపాలి.ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివరి వరకు పట్టించి గంటపాటు ఆరనివ్వాలి.
ఆ తర్వాత కుంకుడుకాయలు లేదా రసాయనాలు తక్కువగా ఉండే షాంపులతో తల స్నానం చేయాలి.ఇలా వారానికి రెండుసార్లు ఈ హెయిర్ ప్యాక్ ఉపయోగిస్తే చుండ్రు తగ్గి జుట్టు రాలడం కూడా ఆగిపోతుంది.
కొత్త జుట్టు పెరగడంతో పాటు తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది.







