బట్టల మీద ఎలాంటి మరక పడిన ఈ విధంగా చేస్తే మళ్ళి కొత్త వాటిలాగా మెరుస్తాయి

బట్టల మీద ఏదైనా తినేటప్పుడు లేదా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బురద వంటివి పడటం సహజమే.ఇక పిల్లల విషయం చెప్పనవసరం లేదు.

 How To Remove Stains On Your Clothes Naturally-TeluguStop.com

వారు రోజంతా ఆటపాటల్లో మునిగినప్పుడు కూడా బట్టల మీద మొండి మరకలు పడటం సహజమే.ఇటువంటి మరకలు వదిలించుకోవడానికి కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.

నూనె మరకలు
వంటగదిలో పనిచేస్తున్నప్పుడు బట్టలపై నూనె మరకలు పడుతూ ఉంటాయి.ఆ నూనె మరకలను సులభంగా వదిలించుకోవడానికి నిమ్మకాయ సహాయపడుతుంది.

నూనె మరక పడిన ప్రదేశంను నిమ్మ చెక్కతో రుద్దితే సులభంగా నూనె మరక తొలగిపోతుంది.

ఇంక్ మరకలు
ఇంక్ మరకలను తొలగించటానికి హ్యాండ్ శానిటైజర్ ని ఉపయోగించాలి.

మరక పడిన ప్రదేశంలో హ్యాండ్ శానిటైజర్ ని వేసి బ్రష్ తో రబ్ చేయాలి.ఆ తర్వాత వేడి నీటిలో డీప్ చేసి ఉతకాలి.

మట్టి మరకలు
మట్టి మరకలు మొండిగా ఉంటాయి.వాటిని వదిలించటం కాస్త కష్టమైన పనే.మట్టి మరకలను వదిలించటానికి బ్లీచింగ్ పౌడర్ బాగా పనిచేస్తుంది.బ్లీచింగ్ పౌడర్ లో నీటిని కలిపి పేస్ట్ చేయాలి.

ఈ పేస్ట్ మట్టి మరకల మీద రాసి రుద్దితే మట్టి మరకలు వదిలిపోతాయి.

రక్తం మరకలు
దుస్తుల మీద ఏర్పడ్డ బ్లడ్ మరకలను తొలగించడానికి ఉప్పు చాలా బాగా సహాయపడుతుంది.

దుస్తుల మీద రక్తం మరకలు పడిన వెంటనే ఆ దుస్తులను ఉప్పు నీటిలో డిప్ చేసి 15 నిముషాల తర్వాత వాష్ చేయాలి.

ఐస్ క్రీమ్ మరకలు
దుస్తుల మీద ఏర్పడ్డ ఐస్ క్రీమ్ మరకలను తొలగించటానికి నిమ్మరసం చాలా బాగా సహాయపడుతుంది.

మరకల మీద నేరుగా కొన్ని చుక్కల నిమ్మరసం వేసి రుద్ది తర్వాత సోప్ వాటర్ తో శుభ్రం చేయాలి.

జ్యుస్ మరకలు
దుస్తుల మీద ఏర్పడ్డ జ్యూస్ మరకలను తొలగించటానికి అమ్మోనియం చాలా బాగా సహాయపడుతుంది .మొదట మరకలను నీటితో శుభ్రంగా కడిగి తర్వాత అమ్మోనియంను వేసి రుద్ది శుభ్రం చేయాలి.

చూసారుగా ఫ్రెండ్స్ ఈ చిట్కాలను ఉపయోగించి బట్టలపై మరకలను సులభంగా తొలగించుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube