తెలంగాణ( Telangana )లో సినిమాల ప్రదర్శనను నిలిపివేయనున్నారు.ఈ మేరకు రెండు వారాల పాటు సినిమా థియేటర్లు మూత పడనున్నాయి.
ఈ క్రమంలోనే శుక్రవారం నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్స్( Single Screen Theatres) ను మూసివేస్తున్నట్లు థియేటర్స్ యాజమాన్యాలు తెలిపింది.థియేటర్ ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో మూసివేస్తున్నట్లు యాజమాన్యాలు వెల్లడించాయి.
సినిమా ప్రదర్శనలతో లాభం కంటే నష్టమే ఎక్కువ అని థియేటర్ల యాజమాన్యాలు చెబుతున్నారు.ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందుల వలన రెండు వారాల పాటు స్వచ్ఛందంగా థియేటర్లను మూసివేస్తున్నామని ప్రకటించాయి.
నిర్మాతలు ప్రోత్సహించి థియేటర్ అద్దెలు పెంచితే సినిమా ప్రదర్శనలు కొనసాగిస్తామని యాజమాన్యాలు తెలిపాయి.