తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్( Bettings ) జోరు షురూ అయింది.ఏపీ, తెలంగాణలో ఎన్నికల ఫలితాలపై బెట్టింగులు జోరందుకున్నాయి.
ఐపీఎల్ బెట్టింగులను తలదన్నేలా ఎన్నికల గెలుపు ఓటములపై బెట్టింగులు సాగుతున్నాయి.తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలతో పాటు ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుపై రూ.కోట్లలో బెట్టింగులు జరుగుతున్నాయని తెలుస్తోంది.పిఠాపురంలో పవన్ కల్యాణ్( Pawan Kalyan ) గెలుపుపై కూడా బెట్టింగ్ సాగుతోందని సమాచారం.
అదేవిధంగా హైదరాబాద్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, మహబూబ్ నగర్, చేవెళ్ల స్థానాలపై బెట్టింగులు సాగుతున్నాయని సమాచారం.రిసార్ట్, ఫామ్ హౌజ్, క్లబ్ లను అద్దెకు తీసుకుని మరీ బెట్టింగు రాయుళ్లు పందెం కాస్తున్నారు.
ఈ క్రమంలో బెట్టింగులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.