ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత కూడా కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ మేరకు రాయలసీమ, పల్నాడు( Rayalaseema, Palnadu )ల్లో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరుతో పాటు గుంటూరు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.దాడులు, ప్రతి దాడుల నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది.
ఉద్రిక్తతల నేపథ్యంలో తాడిపత్రి, మాచర్ల పట్టణాలను పోలీసులు తమ గుప్పెట్లోకి తీసుకున్నారు.అదనపు బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అయితే పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని చోట్ల అల్లరి మూకలు బీభత్సం సృష్టిస్తున్నాయి.ఇక మరోవైపు జమ్మలమడుగు, మాచర్ల మరియు గురజాల ఎమ్మెల్యేలు గృహ నిర్బంధంలో ఉన్నారని సమాచారం.