తెలంగాణలో సినిమాల ప్రదర్శన నిలిపివేత

తెలంగాణ( Telangana )లో సినిమాల ప్రదర్శనను నిలిపివేయనున్నారు.ఈ మేరకు రెండు వారాల పాటు సినిమా థియేటర్లు మూత పడనున్నాయి.

ఈ క్రమంలోనే శుక్రవారం నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్స్( Single Screen Theatres) ను మూసివేస్తున్నట్లు థియేటర్స్ యాజమాన్యాలు తెలిపింది.

థియేటర్ ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో మూసివేస్తున్నట్లు యాజమాన్యాలు వెల్లడించాయి.సినిమా ప్రదర్శనలతో లాభం కంటే నష్టమే ఎక్కువ అని థియేటర్ల యాజమాన్యాలు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందుల వలన రెండు వారాల పాటు స్వచ్ఛందంగా థియేటర్లను మూసివేస్తున్నామని ప్రకటించాయి.

నిర్మాతలు ప్రోత్సహించి థియేటర్ అద్దెలు పెంచితే సినిమా ప్రదర్శనలు కొనసాగిస్తామని యాజమాన్యాలు తెలిపాయి.

వైయస్సార్ బీమా పథకం పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం..!!