కాయ్ రాజా కాయ్ .. ఏపీలో బెట్టింగ్ రాయుళ్ల హడావుడి

ఏపీలో ఎన్నికల( APElections ) హడావుడి ముగిసింది.పోలింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి బెట్టింగ్ రాయుళ్ల సందడి మొదలైంది .

 Political Bettings In Ap Details, Political Bettings, Bettings, Tdp, Janasena,-TeluguStop.com

ఏ పార్టీ అధికారంలో వస్తుంది ఏ నియోజకవర్గం లో ఏ అభ్యర్థి గెలుస్తాడు ?  మెజారిటీ ఎంత, ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అనే దానిపై జోరుగా పందాలు నడుస్తున్నాయి.ముఖ్యంగా వివిధ పార్టీల్లోని ప్రముఖ నాయకులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో బెట్టింగ్ కోట్లలో జరుగుతున్నాయి.

తమ నాయకుడే గెలుస్తాడు,  తమ పార్టీని అధికారంలోకి వస్తుందని ,ఎవరికి వారు పందాలు కాస్తున్నారు.గ్రామాలు పట్టణాలు అనే తేడా లేకుండా అన్నిచోట్ల ఈ పందాలు జరుగుతున్నాయి.

ఇంకా ఎన్నికల ఫలితాలకు చాలా సమయం ఉండడంతో,  ముందుగానే ఈ పందాలు మొదలయ్యాయి.

Telugu Ap, Janasena, Lokesh, Pawan Kalyan, Ysrcp-Politics

కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి.ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలో ఈ బెట్టింగ్ హడావుడి ఎక్కువగా ఉంది.దెందులూరు ,భీమవరం,  ఉండి,  నరసాపురం పార్లమెంట్,  ఏలూరు పార్లమెంట్ స్థానాల ఫలితాల పైన, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan)పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం పైన పందాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

ఇక టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం,  లోకేష్( Nara Lokesh ) పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గాలలో గెలుపు,  అభ్యర్థుల మెజారిటీ పైన పందాలు జరుగుతున్నాయి.పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ మెజారిటీ పైనే భారీగా బెట్టింగ్ జరుగుతున్నాయి.

గెలిచే పార్టీ ఏది అనే దానిపైన , నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు,  బెట్టింగ్ లు కొనసాగుతున్నాయి.

Telugu Ap, Janasena, Lokesh, Pawan Kalyan, Ysrcp-Politics

  కొన్నిచోట్ల డబ్బుకు బదులు భూములు,  వాహనాలను బెట్టింగ్  కు పెడుతున్నారు.ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ ఈ బెట్టింగులు ఎక్కువగానే ఉన్నాయి.కోట్ల రూపాయల సొమ్ములు చేతులు మారుతున్నాయి .పోలింగ్ ముగియకముందే ఈ బెట్టింగ్ మొదలయ్యాయి.సామాన్యుల సైతం ఈ బెట్టింగ్ లో పాల్గొంటూ ఉండడంతో,  వారి కుటుంబాల్లో ఆందోళన కనిపిస్తోంది.

ఈ బెట్టింగులు ఎక్కడికక్కడ ఫోన్ల ద్వారా జరుగుతుండడం తో వీటిని అరికట్టడం పోలీసులకు పూర్తిస్థాయిలో సాధ్యం కావడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube