వైట్‌హౌస్‌లోకి ట్రక్కుతో దూసుకెళ్లే యత్నం ..నేరం అంగీకరించిన భారతీయుడు, త్వరలోనే శిక్ష ఖరారు

గతేడాది అమెరికాలో 20 ఏళ్ల భారతీయుడు ఆ దేశ అధ్యక్ష నివాసం వైట్‌హౌస్‌పై ట్రక్కుతో దాడి చేసిన నేరాన్ని అంగీకరించాడు.ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని నాజీ జర్మనీ భావజాలంతో అక్కడ నియంతృత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ చర్యకు పాల్పడినట్లుగా పేర్కొన్నాడు.

 Indian National Pleads Guilty To Attacking White House With Rented Truck , St. L-TeluguStop.com

మిస్సౌరీలోని సెయింట్ లూయిస్‌కు( St.Louis, Missouri ) చెందిన సాయివర్షిత్ కందుల గతేడాది మే 22న రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి వైట్‌హౌస్‌లోకి ప్రవేశించాలనుకున్నాడు.ప్లాన్‌లో భాగంగా ఓ ట్రక్కును అద్దెకు తీసుకుని వైట్‌హౌస్ ఫెన్సింగ్‌ను ఢీకొట్టాడు.ఈ నేరానికి గాను ఆగస్ట్ 23న సాయివర్షిత్‌కు శిక్షను ఖరారు చేయనున్నారు యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తి డాబ్నీ ఎల్ ఫ్రెడరిక్( Dabney L Frederick ).

యూఎస్ అటార్నీ మాథ్యూ గ్రేవ్స్ ( US Attorney Matthew Graves )మాట్లాడుతూ కందుల సాయివర్షిత్.నాజీ జర్మనీ భావజాలానికి తీవ్రంగా ప్రభావితమయ్యాడని తెలిపారు.

తన లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైతే అమెరికా అధ్యక్షుడిని , ఇతరులను చంపడానికి ఏర్పాట్లు చేస్తానని దర్యాప్తు అధికారులతో చెప్పాడు.అతని చర్యలు బెదిరింపు లేదా బలప్రయోగం ద్వారా ప్రభుత్వాన్ని ప్రభావితం చేయడమేనని అమెరికా న్యాయశాఖ తెలిపింది.

కోర్టు పత్రాల ప్రకారం .సాయివర్షిత్ మే 22 , 2023 మధ్యాహ్నం సెయింట్ లూయిస్ నుంచి వాషింగ్టన్ డీసీకి వన్ వే ఫ్లైట్ టికెట్‌తో చేరుకున్నాడు.

Telugu Indiannational, Barricades, Missouri, St Louis, Matthew-Telugu NRI

ఆ రోజు సాయంత్రం 5.20 గంటలకు డల్లెస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని .సాయంత్రం 6.30 గంటలకు ట్రక్కును అద్దెకు తీసుకున్నాడు.భోజనం చేసి గ్యాస్ ఎక్కించుకుని వాషింగ్టన్‌కి బయల్దేరాడు.అనంతరం అక్కడి హెచ్ స్ట్రీట్, నార్త్ వెస్ట్ , 16వ స్ట్రీట్, నార్త్‌వెస్ట్ జంక్షన్ వద్ద రాత్రి 9.35 గంటలకు వైట్‌హౌస్ , ప్రెసిడెంట్స్ పార్క్‌ను రక్షించే బారికేడ్స్‌ను ఢీకొన్నాడు.అనంతరం ఫుట్‌పాత్‌పైకి ట్రక్కును నడుపుకుంటూ వెళ్లడంతో పాదచారులు ప్రాణభయంతో పరుగులు తీశారు.

Telugu Indiannational, Barricades, Missouri, St Louis, Matthew-Telugu NRI

అనంతరం రివర్స్‌లో రెండవసారి మెటల్ బారికేడ్స్‌ను ఢీకొట్టి ముందుకు దూసుకెళ్లాడు సాయివర్షిత్.అయితే ఇంజిన్ నుంచి ఆయిల్ లీక్ , విపరీతమైన పొగ రావడంతో ట్రక్కును నిలిపివేశాడు.తర్వాత బ్యాగ్‌లోంచి నాజీ స్వస్తికతో వున్న జెండాను తీసి ట్రక్కుకి కట్టాడు.

వెంటనే అప్రమత్తమైన యూఎస్ పార్క్ పోలీసులు, యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారులు ఘటనాస్థలంలోనే సాయివర్షిత్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఇతని చర్యల కారణంగా నేషనల్ పార్క్ సర్వీస్‌కు 4,322 డాలర్లు .యూ హాల్ ఇంటర్నేషనల్‌కు 50 వేల డాలర్లు నష్టం వాటిల్లింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube