అమెరికా : వైట్‌హౌస్‌లో మారుమోగిన ‘‘సారే జహాసే అచ్చా’’.. పులకించిన ఇండో అమెరికన్లు

అమెరికా అధ్యక్షుడు కొలువైయుండే వైట్‌హౌస్‌( White House )లో భారత జాతీయ గేయం ‘సారే జహాసే అచ్చా ’ మారుమోగింది.వివరాల్లోకి వెళితే .

 ‘sare Jahan Se Achchha Hindustan Hamara’ Played At White House , Us Preside-TeluguStop.com

అధ్యక్షుడు జో బైడెన్‌ , ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో కలిసి వార్షిక ‘‘ఆసియా అమెరికన్, నేటివ్ హవాయి అండ్ పసిఫిక్ ఐలాండర్ (ఏఏఎన్‌హెచ్‌పీఐ) హెరిటేజ్ మంత్‌ను జరుపుకుంది.ఈ సందర్భంగా అనేకమంది ఆసియా అమెరికన్ల ముందు వైట్‌హౌస్‌ మెరైన్ బ్యాండ్ సోమవారం ‘‘సారే జహాసే అచ్చా హిందూస్థాన్ హమారా’’ను వాయించింది.

అంతేకాదు.ఇండో అమెరికన్ల విజ్ఞప్తి మేరకు దీనిని రెండుసార్లు వాయించడం విశేషం.

Telugu Heritage, Mohammad Iqbal, Narendra Modi, Sarejahan, Joe Biden, White-Telu

ఈ సందర్భంగా ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ నేత అజయ్ జైన్ భూటోరియా పీటీఐతో మాట్లాడుతూ.ఏఏఎన్‌హెచ్‌పీఐ హెరిటేజ్( Heritage ) నెల కావడంతో తాను వైట్‌హౌస్‌కు హాజరయ్యానని తెలిపారు.ఈ నేపథ్యంలో ‘‘సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా ’’ వాయిస్తూ సంగీత విద్వాంసులు తనను పలకరించారని పేర్కొన్నారు.వైట్‌హౌస్‌లో ఇది గర్వించదగ్గ క్షణమని.తాను వారితో కలిసి పాడానని, మరోసారి ప్లే చేయాల్సిందిగా అభ్యర్ధించానని అజయ్ అన్నారు.ఏఏఎన్‌హెచ్‌పీఐ హెరిటేజ్ నెలలో ఈ పాటను ప్లే చేయడం ద్వారా అధ్యక్షుడు జో బైడెన్ ( Joe Biden)అతని బృందం భారత్-అమెరికా సంబంధాల పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నారో చెప్పవచ్చన్నారు.

Telugu Heritage, Mohammad Iqbal, Narendra Modi, Sarejahan, Joe Biden, White-Telu

కాగా.శ్వేతసౌధంలో భారత దేశభక్తి గీతాన్ని ప్లే చేయడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి.గతేడాది జూన్ 23న ప్రధాని నరేంద్ర మోడీ చారిత్రాత్మక యూఎస్ పర్యటన సందర్భంగా ఈ గేయాన్ని వాయించారు.మోడీ అమెరికా రావడానికి ముందే మెరైన్ బ్యాండ్ ఈ గేయాన్ని ప్రాక్టీస్ చేసింది.

భారత స్వాతంత్య్ర పోరాటంలో ప్రజల్లో స్పూర్తిని రగిలించేందుకు నాడు కవులు, కళాకారులు ఎంతో శ్రమించారు.ఈ నేపథ్యంలోనే మహమ్మద్ ఇక్బాల్ ( Mohammad Iqbal )‘‘సారే జహాసే అచ్చా హిందుస్తాన్ హమారా ’’ అనే గేయాన్ని రాశారు.

ఇది నాడు ఉద్యమాన్ని తీవ్రంగా ప్రభావితం చేయడంతో పాటు దేశభక్తిని రగిలించింది.మహమ్మద్ ఇక్బాల్ అవిభక్త భారతదేశంలోని సియాల్‌కోట్ ( ప్రస్తుతం పాకిస్తాన్‌లో వుంది)లో జన్మించారు.పాకిస్తాన్ దేశాన్ని ఏర్పాటు చేయాలన్న ఐడియా కూడా ఇయనదే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube