ఆర్ఆర్ఆర్, కల్కి కంటే ఎక్కువ బడ్జెట్ తో రామాయణం.. ఏకంగా అన్ని వందల కోట్లా?

ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది.చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు.

 Ranbir Kapoor And Sai Pallavi Upcoming Movie Ramayanam To Be Made In Rs 853 Cr B-TeluguStop.com

దర్శక నిర్మాతలు కూడా అందుకు తగ్గట్టుగా కథలను బడ్జెట్లను సిద్ధం చేసుకుంటున్నారు.అలాగే భారీ బడ్జెట్ సినిమాలను కూడా తెరకెక్కుతున్నాయి.

ఇప్పటికే చాలా సినిమాలు పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కి సంచలన విజయాలను అందుకున్నాయి.మరికొన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి.

ఇప్పుడు తెరకెక్కుతున్న సినిమాలు మినిమమ్ వందకోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

Telugu Cr Budget, Brahmastra, Budget, Kalki, Nitesh Tiwari, Ramayanam, Ranbir Ka

కొంత మంది నిర్మాతలు, నటీనటులు, దర్శకులు ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి కష్టపడుతున్నారు.ఇలా ప్రతి సినిమా సినిమాకు భారతీయ సినిమా పరిధి పెరుగుతూనే వస్తోంది.ఇకపోతే గత కొద్ది రోజులుగా రామాయణం సినిమా గురించి ఎన్నో రకాల గాసిప్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే.

అందులో సాయి పల్లవి రన్బీర్ కపూర్ ఇద్దరూ జంటగా నటించబోతున్నారు అంటూ ఎన్నో రకాల ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.రామాయణం( Ramayanam ) ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తుండగా, నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు.

Telugu Cr Budget, Brahmastra, Budget, Kalki, Nitesh Tiwari, Ramayanam, Ranbir Ka

కన్నడ స్టార్ హీరో యష్ ( Yash )సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఇప్పటికే ఎన్నో రకాల వార్తల వినిపించగా తాజాగా మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ సినిమా బడ్జెట్ దాదాపు 835 కోట్లు అని తెలుస్తోంది.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది.రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు.ఈ సినిమాలో చాలా మంది ప్రముఖ ఆర్టిస్టులు నటిస్తున్నారు.ఆర్టిస్టుల రెమ్యూనరేషన్, సెట్ల నిర్మాణం, గ్రాఫిక్స్ వర్క్ అన్నీ కలిపి ఈ సినిమా బడ్జెట్ 835 కోట్ల వరకు చేరిందని తెలుస్తోంది.2022లో విడుదలైన బ్రహ్మాస్త్ర సినిమా( Brahmāstra ) 450 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కింది.ఇప్పటివరకు బాలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఇది.ఆ సినిమాలో కూడా రణబీర్ కపూర్ హీరోగా నటించాడు.ఇప్పుడు ఆ రికార్డును తానే బద్దలు కొట్టబోతున్నాడు.రణబీర్ కపూర్ నటించిన రామాయణం: పార్ట్ 1బడ్జెట్ 835 కోట్లు అన్న వార్త ఇప్పుడు బాలీవుడ్ లో తెగ చక్కర్లు కొడుతోంది.అంటే ఆర్ఆర్ఆర్, కల్కి సినిమాల కంటే ఎక్కువ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.మరి ఈ వార్తల్లో వాస్తవంతో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube