మృదువైన మెరిసేటి అధరాల కోసం ఈ టిప్స్ ను తప్పకుండా ఫాలో అవ్వండి!

తమ అధరాలు( Lips ) మృదువుగా మెరిసిపోతూ కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.ముఖ్యంగా మగువలు అటువంటి పెదవుల కోసం తెగ ఆరాటపడుతూ ఉంటారు.

 Be Sure To Follow These Tips For Smooth Shiny Lips Details, Shiny Lips, Smooth-TeluguStop.com

అయితే అధరాలను మృదువుగా మరియు కాంతివంతంగా మెరిపించుకోవడం అంత కష్టమైన పనేమీ కాదు.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ అందుకు చాలా అద్భుతంగా తోడ్పడతాయి.

మరి ఆ టిప్స్ ఏంటో ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం పదండి.

పెదాలపై మృత కణాలు పేరుకుపోతూ ఉంటాయి.

అవి లిప్స్ ను డార్క్ గా మరియు డల్ గా మారుస్తాయి.కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి.

అందుకోసం వన్ టేబుల్ స్పూన్ షుగర్ లో( Sugar ) రెండు టీ స్పూన్లు కొబ్బరి నూనె( Coconut Oil ) వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసి రెండు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకోవాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.వారానికి ఒక్కసారైనా ఈ విధంగా స్క్రబ్బింగ్ చేసుకుంటే మురికి మృత కణాలు పోయి పెదాలు కాంతివంతంగా మారతాయి.

పెదాలకు కావాల్సినంత తేమ, పోషణ కూడా అందుతుంది.

Telugu Aloevera Gel, Beautiful Lips, Tips, Coconut Oil, Lips, Latest, Lip Care,

అలాగే డైట్ లో బీట్ రూట్( Beet Root ) మరియు దానిమ్మ ను( Pomegranate ) చేర్చుకోవాలి.ఇవి ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాదు చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయి.అదే సమయంలో పెదాలకు సహజ మెరుపును జోడిస్తాయి.

పెదాలను మృదువుగా మార్చడంలో కలబంద చాలా బాగా సహాయపడుతుంది.రోజుకు రెండుసార్లు న్యాచురల్ కలబంద జెల్ ను( Natural Aloevera Gel ) పెదాలకు అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి.

ఇలా చేస్తే లిప్స్ స్మూత్ గా మారతాయి.డ్రై నెస్ తగ్గుతుంది.

Telugu Aloevera Gel, Beautiful Lips, Tips, Coconut Oil, Lips, Latest, Lip Care,

లిప్స్‌ పొడిబారకుండా మరియు పగలకుండా ఉండాలంటే ప్రతిరోజు నైట్ నిద్రించేముందు పెదాల‌కు పెట్రోలియం జెల్లీని అప్లై చేసుకోవాలి.లేదా బాదం నూనె, షియా బటర్ ను కూడా ఉపయోగించవచ్చు.ఇవి పెదాలను తేమగా ఉంచుతాయి.ఇక బయట రసాయనాలు ఉన్న లిప్ బాబ్ లను వాడే కన్నా ఇంట్లోనే సహజంగా లిప్ బామ్ ను తయారు చేసుకోవచ్చు.

అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు పెట్రోలియం జెల్లీ వేసుకోవాలి.అలాగే పావు టీ స్పూన్ బీట్ రూట్ పౌడర్, హాఫ్‌ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకోవాలి.

ఇప్పుడు ఈ గిన్నెను మరుగుతున్న వాటర్ లో ఉంచి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్ర‌మాన్ని ఒక బాక్స్ లో నింపుకొని భద్రపరుచుకోవాలి.

రోజుకు రెండు లేదా మూడు సార్లు ఈ లిప్ బామ్ ను వాడితే పెదాలు ఎర్రగా కాంతివంతంగా మారతాయి.మృదువుగా అందంగా మెరుస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube